Viral Videos: ఒళ్లు గగుర్పొడిచేలా రీల్స్‌ తీసుకున్న యువతి.. వీడియో వైరల్

ఆమె విద్యుత్‌ తీగలను పట్టుకున్న సమయంలో అక్కడ విద్యుత్‌ లేదు. లేదంటే ఆమె ప్రాణాలు కోల్పోయేది.

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలా మంది విచిత్ర, ప్రమాదకర రీతుల్లో రీల్స్‌ చేస్తున్నారు. చాలా మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రీల్స్ తీసుకుంటూ వెర్రి చేష్టలకు పాల్పడుతున్నారు.

తాజాగా విద్యుత్ స్తంభం ఎక్కుతూ ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. @maheshpatel8819 హ్యాండిల్‌తో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.

ఈ యువతి ఏ ప్రాంతంలో ఈ రీల్‌ చేసిందో తెలియరాలేదు. ఆ యువతి ప్రమాదకర రీతిలో రీల్స్‌ చేసిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆమె విద్యుత్‌ తీగలను పట్టుకున్న సమయంలో అక్కడ విద్యుత్‌ లేదు. లేదంటే ఆమె ప్రాణాలు కోల్పోయేది.

‘ఇటువంటి వాళ్లంతా ఎక్కడి నుంచి వస్తున్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమెను ఎవరికైనా చూపించాలని, లేదంటే ఇటువంటి వీడియోలు మరిన్ని తీస్తూ, ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేస్తుందని నెటిజన్లు అంటున్నారు.

బీజేపీ ఎమ్మెల్యేపై గుడ్డు విసిరిన యువకులు.. వీడియో వైరల్