Uttar Pradesh : భార్య, భర్తల మధ్య ఘర్షణ.. తొమ్మిదో ఫ్లోర్ నుంచి దూకిన మహిళ
ఓ మహిళ తొమ్మిదో అంతస్తును నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఘజియాబాద్ బస్సు స్టేషన్ సమీపంలో గల భవనంలోని తొమ్మిదో ఫ్లోర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళవారం వీరి మధ్య గొడవ జరిగింది.
- kunduru Vinod
- Published On : July 15, 2021 / 02:18 PM IST
Uttar Pradesh
Uttar Pradesh : ఓ మహిళ తొమ్మిదో అంతస్తును నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఘజియాబాద్ బస్సు స్టేషన్ సమీపంలో గల భవనంలోని తొమ్మిదో ఫ్లోర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళవారం వీరి మధ్య గొడవ జరిగింది.
సుమారు మూడు గంటల పాటు వారి ఇంట్లోంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. భర్తతో గొడవపడిన మహిళ మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది. తమ ఫ్లోర్ లోని బాల్కనీ నుంచి దూకేందుకు యత్నించింది. దూకే సమయంలో ఆమె చెయ్యి భర్తకు అందటంతో కాపాడే ప్రయత్నం చేశాడు. చెయ్యి పట్టుకొని పైకి లాగేందుకు ప్రయాణించాడు. భవనంపై వేలాడుతున్న మహిళను గమనించిన స్థానికులు కిందపడే అవకాశం ఉందని భావించి నేలపై బెడ్లు పరిచారు. అనంతరం ఆమెను కాపాడేందుకు 9 ఫ్లోర్ కి పరుగు తీశారు. కానీ లోపల డోర్ లాక్ చేసి ఉండటంతో తిరిగి కిందకు వచ్చారు.
ఈ సమయంలోనే భర్త పట్టుకోల్పోవడంతో కిందపడి పోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆమె స్పృహలోకి వస్తే కానీ విషయం తెలియదని వివరించారు.
ग़ाज़ियाबाद में पति से झगड़े के बाद एक महिला ने 9वीं मंज़िल से छलांग लगाई,पति ने 3 मिनट तक हाथ पकड़कर रखा और शोर मचा दिया,शोर सुनकर नीचे लोगों ने गद्दे बिछा दिए,पकड़ कमजोर पड़ते ही महिला नीचे गिरी और गंभीर से घायल हो गई pic.twitter.com/6WPYzEMI3A
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 15, 2021
