Chennai : మహిళను చంపి.. ముక్కలు చేసి.. బిర్యానీ వండారు..! వెన్నులో వణుకు పుట్టించే ఘటన..
Woman body found in suitcase on Tamil Nadu Express train : చెన్నై నగరంలో మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే.. వెన్నులో వణుకు పుట్టించే కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది.
- Harish Thanniru
- Updated on- August 23, 2026 / 07:42 AM IST
Woman body found in suitcase on Tamil Nadu Express train
Woman body found in suitcase on Tamil Nadu Express train : చెన్నై నగరంలో మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే.. వెన్నులో వణుకు పుట్టించే కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జంట మహిళను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను ముక్కలుముక్కలుగా చేసి.. బిర్యానీ వండారు.. మిగిలిన భాగాలను సూట్ కేసులో పెట్టి.. చెన్నై – ఢిల్లీ రైలులో వదిలేశారు.. ఈనెల 5న ఈ సూట్ కేసులో మృతదేహం శరీర భాగాలను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టగా.. ఊహించని.. ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఓ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఎరుపు రంగు సూట్‌కేసు నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకొని తెరిచి చూడగా.. అందులో మహిళ శరీర భాగాలు ముక్కలుముక్కలుగా చేసి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. సూట్‌కేస్ చెన్నై నుంచి వచ్చినట్లు గుర్తించారు.
సూట్‌కేస్ ఎవరు తీసుకొచ్చారు.. మృతి చెందిన మహిళ ఎవరు అనే విషయాలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు.. ఈ క్రమంలో తమిళనాడు రైల్వే పోలీసులను సంప్రదించారు. వారు సెంట్రల్ రైల్వేస్టేషన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 350కిపైగా సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఒక మహిళ, పురుషుడు ఎరుపు రంగు సూట్‌కేస్‌తో రైల్వేస్టేషన్‌కు వచ్చి.. దానిని తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఉంచి ఏమీ తెలియనట్లు బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. ఆ తరువాత వారు సబర్బన్ లోకల్ రైలు ఎక్కి చెన్నై శివారులోని గూడువాంచేరికి వెళ్లినట్లు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు.
పలు అంశాలపై విచారణ జరిపిన పోలీసులు.. నిందితులు వారేఅని గుర్తించి.. గూడువాంచేరిలోని వారి నివాసానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. చుట్టుపక్కల వారిని ఆరాతీయగా.. ఆ ఇంట్లో ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ ఉంటున్నారని, వారితోపాటు హయాత్ నిషా అనే మహిళ ఉంటున్నట్లు తెలిపారు. అయితే, మాణిక్ ఉత్తిన్ లస్కర్ దంపతులు తనకు తమ్ముడు, మరదలు అవుతారని హయాత్ నిషా పేర్కొనేదని స్థానికులు తెలిపారు. ఆ తరువాత పోలీసులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చూడగా రక్తపు మరకలు కనిపించాయి.
ఇంట్లోని వంటగదిలో బిర్యానీ పాత్రకు చుట్టూ మైదాపండి అతికించి ఉండటంతో.. దానిని ఓపెన్ చేసి చూడగా.. మానవ శరీర భాగాలతో బిర్యానీ వండినట్లుగా పోలీసులు గుర్తించారు. బిర్యానీ పాత్రను స్వాధీనం చేసుకొని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గురైన మహిళ హయాత్ నిషాగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యకు గురైన మహిళ తలకోసం, నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
