Viral Video: నువ్వసలు తల్లివేనా? పసిబిడ్డ ప్రాణంతో చెలగాటం.. స్కూటర్ డిక్కీలో పసికందును పెట్టి

ఆమె కావాలని చేసిందో లేక రీల్స్ కోసం చేసిందో లేక సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చేసిందో మరో కారణమో తెలియదు కానీ.. ఆమె చేసిన పని మాత్రం ముమ్మాటికే తప్పే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

  • Published On : March 14, 2026 / 04:57 PM IST

Scooter Dikki Representative Image (Image Credit To Original Source)

  • పసిబిడ్డను స్కూటర్ డిక్కీలో పడుకోబెట్టిన తల్లి
  • తల్లి చేసిన పనిపై తీవ్ర విమర్శలు
  • రీల్స్ కోసం దిగజారిపోతావా అంటూ ఆగ్రహం
  • పసిబిడ్డ ప్రాణంతో చెలగాటం ఆడిన మహిళను అరెస్ట్ చేయాలని డిమాండ్

 

Viral Video: ఓ తల్లి చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆమెను అంతా తిట్టి పోస్తున్నారు. నువ్వసలు తల్లివేనా అని కసురుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇంతకు దిగజారిపోతావా అంటూ విరుచుకుపడుతున్నారు. అసలు ఆమె చేసిన తప్పేంటి అంటే.. ముక్కు పచ్చలారని పసిబిడ్డను స్కూటర్ డిక్కీలో పెట్టడమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.

ఒక మహిళ తన పసిబిడ్డను స్కూటర్ సీటు కింద ఉండే స్టోరేజ్ బాక్స్ లో పడుకోబెట్టింది. ఆ తర్వాత సీటు మూసివేసి స్కూటీపై కూర్చుని వెళ్లిపోతుంది. ఇదంతా వీడియోలో ఉంది. ఈ దృశ్యం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పసిబిడ్డ ప్రాణంతో చెలగాటం ఆడతావా అంటూ ఆ మహిళపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. సాధారణంగా స్కూటర్ సీటు కింద డిక్కీలో హెల్మెట్ లేదా ఏవైనా సామాన్లు పెట్టుకుంటారు. దాన్ని స్టోరేజ్ బాక్స్ అంటారు. అందులో ఏవైనా వస్తువులు ఉంచాక సీటు మూసి వేస్తారు.

పసిబిడ్డకు ఏమైనా జరిగి ఉంటే?

సీటు లాక్ చేశాక.. డిక్కీలో గాలి ప్రసరణ ఏమాత్రం ఉండదు. లోపల ఊపిరి ఆడటం చాలా కష్టం. పైగా ఇంజిన్ పక్కనే ఉండటం వల్ల ఆ ప్రాంతం బాగా హీట్ ఎక్కిపోతుంది. అలాంటి ప్రమాదకర చోటులో పసిబిడ్డను ఉంచడం ఏంటి? అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. రీల్స్ కోసమే ఆమె ఇలా చేసిందని ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు బిడ్డ ప్రాణాలను పణంగా పెడతావా అంటూ మండిపడుతున్నారు. ఆ ఇరుకైన ప్రదేశంలో బిడ్డకు ఊపిరి ఆడుతుందా? గాలి అందక బిడ్డకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? అని ప్రశ్నలతో నిలదీస్తున్నారు.

ఆమె కావాలని చేసిందో లేక రీల్స్ కోసం చేసిందో లేక సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చేసిందో మరో కారణమో తెలియదు కానీ.. ఆమె చేసిన పని మాత్రం ముమ్మాటికే తప్పే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు ఆమె పసిబిడ్డకు తల్లేనా? అనే సందేహం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. కన్న తల్లి అయితే ఇలాంటి పిచ్చి పనులు చేయదని నమ్మకంగా చెబుతున్నారు.

కసాయి తల్లిని అరెస్ట్ చేయాలని డిమాండ్..

అసలే ఎండా కాలం, పైగా డిక్కీలో గాలి ఆడదు, తీవ్రమైన వేడి కూడా… అలాంటి చోటున పసిబిడ్డను పెట్టడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా పసిబిడ్డ ప్రాణాలతో చెలగాటం ఆడటం కరెక్ట్ కానే కాదంటున్నారు. ఇది అత్యంత అమానవీయ ఘటన అని కసురుకుంటున్నారు. కారణం ఏదైనా కావొచ్చు.. పసిబిడ్డ ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఆ మహిళను అరెస్ట్ చేసి పసికందును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించాలని చెబుతున్నారు. ఇటువంటి అమానవీయ దృశ్యాలు చూశాక.. కొంతమందికి తల్లిదండ్రులు అయ్యే అర్హత లేనే లేదంటున్నారు.

Also Read: గ్యాస్ బుక్ చేశారా? డెలివరీ చెయ్యకుండానే మీకు డెలివరీ అయినట్టు మెసేజ్ వస్తే.. ఇలా చేయండి తిక్క కుదురుతుంది..