బెంగుళూరులో ఓ అమ్మాయికి నడిరోడ్డుపై భయానక అనుభవం ఎదురైంది. కారులో వెళ్తున్న యువతిని స్కూటర్ పై వెంబడించారు ముగ్గురు యువకులు. స్కూటర్‌పై వస్తూ కారు డోర్లను కొడుతూ, దాని తలుపులు తెరవడానికి ప్రయత్నించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను కారులోని అమ్మాయి తీసినట్లు తెలుస్తోంది. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత అమ్మాయి గత అర్ధరాత్రి కారులో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కారులోని అమ్మాయి ఆ సమయంలో ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు డయల్ చేసినట్లు తెలుస్తోంది. యువకులు తమను ఫాలో అవుతున్నారని, వాహనాన్ని ఢీ కొంటున్నారని ఆమె అనడం వీడియోలో వినపడుతోంది. స్కూటర్‌పై ఉన్న యువకులు కారులోని వారిని చూస్తూ సైగలు చేస్తూ కనపడుతున్నారు.
కారును ఓవర్టేక్ చేసి, దాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత కారు వేరే రూట్లో వెళ్లిపోయింది. ఆ యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వీడియోను బీజేపీ ఎక్స్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.
ಮಹಿಳೆಯರಿಗೆ ಆತಂಕ ಸೃಷ್ಟಿಸಿದೆ ಮಜಾವಾದಿ @siddaramaiah ಸರ್ಕಾರ.
ಕರ್ನಾಟಕವನ್ನು ಗೂಂಡಾ ರಾಜ್ಯವನ್ನಾಗಿ ಮಾಡುತ್ತಿರುವ @INCKarnataka ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಹದಗೆಡಿಸಿ ಗೂಂಡಾಗಳ ಕೈಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದೆ.
ಬೆಂಗಳೂರಿನಂತಹ ರಾಜಧಾನಿಯಲ್ಲೇ ಯುವತಿಯನ್ನು ಚೇಸ್ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗಿ ಕಾರಿನ ಡೋರ್ ತೆಗೆಯಲು ಯತ್ನಿಸಿದ್ದಾರೆ ಎಂದರೆ,… pic.twitter.com/pVmP10L9fW
— BJP Karnataka (@BJP4Karnataka) April 1, 2024
Also Read: కామెడీ ఎర్రర్స్.. ఒక్క క్యాచ్.. ముగ్గురు స్లిప్ ఫిల్డర్లు.. నవ్వులే నవ్వులు