దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది : ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే..ముచ్చట తీరకుండానే పరార్
- madhu
- Published On : March 15, 2021 / 04:26 PM IST
Bride
Woman steals jewellery : పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ..ఏ ఒక్కటి కుదరలేదు. దీంతో అతను మనోవేదనకు గురయ్యాడు. తనకు జీవితంలో పెళ్లి అవుతుందా ? అని మనస్సులో మథనపడుతూ వచ్చాడు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎదురు కట్నం ఇచ్చి..పేదింటి యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ..తీరా చూస్తే..అతనికి దిమ్మ తిరిగిపోయింది. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
అసలు ఏమైంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో Shahjahanpur జిల్లా Powayan పరిధిలో ఓ గ్రామంలో 34 ఏళ్ల వ్యక్తికి ఎంతోకాలంగా వివాహం జరగలేదు. పెళ్లి కోసమని అతని కుటుంబసభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఏది ఒక్కటి నిశ్చయం కాలేదు. కట్న కానుకలు ఆశించకుండా..కట్నం ఇవ్వలేని దశలో ఉన్న పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వదిన సలహా ఇచ్చింది. Farukkhabad లో ఓ పేదింటి కుటుంబం ఉందని తెలుసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాళ్ల కోరిక మేరకు పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ. 30 వేలను ఇచ్చాడు. ఇక్కడే మొదలైంది అసలు కథ.
ఓ గుడిలో శనివారం నిరాడంబరంగా వివాహం జరిగింది. తన కల నేరివేరినందుకు అతను, అతని కుటుంబం ఫుల్ ఖుష్ లో ఉంది. కానీ..ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. వరుడు Farukkhabad లో ఉన్న తన ఇంటికి భార్యను తీసుకొచ్చాడు. ఆమెతో పాటు ఇద్దరు కూడా వచ్చారు. పెళ్లయిన ఐదు గంటల తర్వాత..పెళ్లి కూతురు కనిపించలేదు. ఆమెతో పాటు ఉన్న ఇద్దరూ కనిపించకుండా పోయాడు. ఎక్కడకు వెళ్లారా ? అని పలు ప్రాంతాల్లో వెతికారు. బట్ నో ఛాన్స్. వారి ఆచూకీ తెలియలేదు. అప్పుడు అర్థమైంది. తన డబ్బు, బంగారు నగలతో ఉడాయించారని. వెంటనే వరుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు, నగల కోసమే పెండ్లి నాటకం ఆడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నారు.
