Women Priests : దేవాలయాల్లో ఇక మహిళా పూజారులు
దేవాలయాల్లో మొట్టమొదటిసారి మహిళా పూజారులను తమిళనాడు ప్రభుత్వం నియమించనున్నారు. ముగ్గురు మహిళలను ఆలయ పూజారులుగా నియమించనున్నట్లు సీఎం స్టాలిన్ చెప్పారు....
- saleem sk
- Published on- September 15, 2023 / 12:57 PM IST
women priests
Women Priests : దేవాలయాల్లో మొట్టమొదటిసారి మహిళా పూజారులను తమిళనాడు ప్రభుత్వం నియమించనున్నారు. ముగ్గురు మహిళలను ఆలయ పూజారులుగా నియమించనున్నట్లు సీఎం స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో తొలిసారి మహిళా పూజారులను నియమించనుండటం పట్ల సనాతన వాదులు థ్రిల్ అవుతున్నారని సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ చెప్పారు. (temple priests in Tamil Nadu) తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళా పూజారులు కృష్ణవేణి, ఎస్ రమ్య, ఎన్ రంజిత లను ప్రభుత్వం ధృవీకరించింది.
Namo Express trains : కొంకణ్ వెళ్లే భక్తుల కోసం నమో ఎక్స్‌ప్రెస్ రైళ్లు
మహిళలు రాష్ట్ర ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజారులుగా శిక్షణ తీసుకున్నారు. వీరిని త్వరలో రాష్ట్రంలోని ఆలయాల్లో సహాయ అర్చకులుగా నియమించనున్నారు. డిపార్ట్‌మెంట్ ఆరు అర్చక శిక్షణ పాఠశాలలను నిర్వహిస్తోంది. అర్చక కోర్సులో మహిళలు చేరడం ఇదే తొలిసారి.
Greater Noida : గ్రేటర్ నోయిడాలో లిఫ్ట్ కూలి నలుగురి దుర్మరణం
మహిళలను అపవిత్రంగా భావించి, స్త్రీ దేవతల ఆలయాల్లోకి కూడా అనుమతించని తరుణంలో ద్రవిడ మోడల్ ప్రభుత్వం దీన్ని సాధ్యం చేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. అన్ని కులాల వారిని పూజారులుగా నియమించడం ద్వారా మహిళలు కూడా ఇప్పుడు గర్భాలయాల్లోకి అడుగుపెట్టి, సమగ్రత, సమానత్వం యొక్క కొత్త శకాన్ని తీసుకువస్తున్నారని స్టాలిన్ ట్వీట్ చేశారు.
