10మంది మహిళలను ఒకేసారి నగ్నంగా గదిలో నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు

సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన మహిళా ట్రైనీలను వైద్య పరీక్షల పేరుతో గ్రూపుగా నగ్నంగా నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు. ఎస్ఎమ్సీ ఎంప్లాయీస్ యూనియన్ అవివాహితులను కూడా ప్రెగ్నెన్సీ టెస్టు పేరుతో వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా క్లర్క్‌లను మెడికల్ టెస్టులంటూ గుంపులుగా నగ్నంగా నిలబెట్టడంపై భగ్గుమంటున్నారు. దీనిపై సూరత్ మునిసిపల్ కమిషనర్ బంచానిధి పానీ స్పందించారు. 

ఆరోపణల్లో నిజాలు తేల్చేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి 15రోజుల్లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. డా.కల్పనా దేశాయ్, అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ గాయత్రి జరీవాలా, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తృప్తి కళాతియాలు ఇందులో సభ్యులు. రూల్స్ ప్రకారం.. ట్రైనీ ఉద్యోగులు ట్రైనింగ్ పిరియడ్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. అందుకోసమే ఇలాంటి చేసినప్పటికీ వారంతా చేసిన పద్ధతి బాగాలేదని అందరినీ ఒకేసారి నగ్నంగా నిలబెట్టడం సిగ్గుగా అనిపించిందని వాపోయారు. 

టెస్టు కోసం ఒకరి తర్వాత ఒకరిని గదిలో పిలవడానికి బదులు.. 10మందిని అందరితో పాటు ఒకేసారి నగ్నంగా గదిలో నిలబెట్టారు. ఇది చట్ట విరుద్ధం.. మానవత్వానికి వ్యతిరేకం. ప్రతి మహిళపై ప్రత్యేక పరీక్షలు చేయాలి. పరీక్ష చేస్తున్న సమయంలోనూ మహిళలను లేడీ డాక్టర్లు అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించారు. 

ప్రెగ్నెన్సీ గురించి డాక్టర్లు పర్సనల్ విషయాలు అడగకూడదు. అవివాహితులను ఫిజికల్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ ఉందో లేదో తేల్చడం బాధాకరం. ట్రైనింగ్ పీరియడ్ తర్వాత పర్మినెంట్ కావాల్సిన ఉద్యోగుల పట్ల ఇలా ప్రవర్తించడం హేయమైన చర్య. ఇది చాలా సీరియస్ విషయం. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళా ఉద్యోగుల పట్ల వాళ్లు దారుణంగా ప్రవర్తించిన మాట వాస్తవమైతే తప్పక చర్యలు తీసుకుంటాం’ జగదీశ్ పటేల్, సూరత్ మేయర్