Fig Fruit: ప్రపంచంలో తొలి సాగు చేసిన పండు ఇదే.. 11 వేల ఏళ్ల చరిత్ర.. యాపిల్ కాదు, అసలు నిజం తెలిస్తే షాక్!
జోర్డాన్ లోయలో జరిగిన పురావస్తు తవ్వకాల ప్రకారం క్రీ.పూ. 9,400–9,200 కాలంలోనే అత్తి(Fig Fruit) చెట్లను సాగు చేసినట్లు తేలింది.
- V Santhosh Kumar
- Updated on- June 10, 2026 / 11:17 AM IST
World oldest cultivated fruit is not apple it is fig
- ప్రపంచపు తొలి సాగు పండు
- 11 వేల ఏళ్ల చరిత్ర
- అంజీర్‌లో అపార పోషకాలు
Fig Fruit: పండ్లు అనేవి మానవుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆపిల్, మామిడి, అరటి వంటి పండ్లు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. కానీ, చరిత్రలో అత్యంత పురాతనంగా సాగు చేసిన పండు ఏది అనే విషయం చాలామందికి తెలియదు. బైబిల్ లో చెప్పినట్టుగా ఆదాము తిన్నది యాపిల్ పండును కాబట్టి, అదే మొదట సాగు చేసిన పండు అని చాలా మంది అనుకుంటారు.
అలా అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్టే. పురావస్తు పరిశోధనలు ప్రకారం నిజం మాత్రం వేరే. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా మనుషులు సాగు చేసిన పండు అత్తి(Fig Fruit) పండు (ఫిగ్) అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే అంది అంజీర్ పండు. మానవ శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందించే ఈ పండు వెనుక కొన్ని వేల సంవత్సరాల చరిత్రే ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
World oldest cultivated fruit is not apple it is fig
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి రూ.500 కోట్ల విరాళాలు.. కేంద్ర విచారణ కోరిన బీజేపీ నేత!
11 వేల ఏళ్లకు పైగా చరిత్ర:
ఇటీవల జోర్డాన్ లోయలో జరిగిన పురావస్తు తవ్వకాలలో లభించిన ఆధారాల ప్రకారం క్రీ.పూ. 9,400–9,200 కాలంలోనే అత్తి చెట్లను మనుషులు సాగు చేసినట్లు తేలింది. అంటే గోధుమలు, బార్లీ వంటి ప్రధాన పంటల సాగుకు ముందే అత్తి పండ్ల పెంపకం జోరుగా సాగేదట. ఈ విషయాన్ని పురావస్తు ఆధారాలతో సహా బయటపెట్టింది.
తొలి వ్యవసాయ పంటల్లో అత్తి స్థానం:
పరిశోధకులు ప్రకారం, పర్తెనోకార్పిక్ అత్తిపండ్లు సహజ పరాగసంపర్కం అవసరం లేదు. అవి సహజంగానే సంపర్కం లేకుండానే అభివృద్ధి చెందుతాయి. దీంతో ఆ కాలం ప్రజలు అడవిలో దొరికిన పండ్లను సేకరించడం మాత్రమే కాకుండా, చెట్లను ఉద్దేశపూర్వకంగా పెంచి సాగు చేసినట్లు ఈ పరిశోదనల్లో తెలుస్తోంది.
ప్రాచీన నాగరికతల్లో అత్తి ప్రాధాన్యం:
ఈజిప్ట్, గ్రీస్, రోమ్ వంటి ప్రాచీన నాగరికతల్లో అత్తిపండుకు ప్రత్యేక స్థానం ఉండేది. సంపద, సంతానోత్పత్తి, శ్రేయస్సు కోసం ఈ అత్తి పండును భావించేవారు. చారిత్రక గ్రంథాలు, కళాఖండాలు, మతపరమైన సంప్రదాయాల్లో కూడా అత్తిపండు ప్రస్తావన ఉండటం విశేషం.
నేటికీ తగ్గని ఆదరణ:
అత్తిపండ్లు పోషక విలువలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో నేటికీ వీటి వినియోగం అధికంగానే ఉంది. వేల ఏళ్ల క్రితం మానవ నాగరికతకు ఆహార భద్రతను అందించిన ఈ పండు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణను పొందుతోంది విశేషం.
