చీనాబ్ వంతెన: ప్రపంచంలో ఎత్తైనది ఇదే!

  • Publish Date - January 15, 2020 / 06:33 AM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తన రైలు ఏదంటే.. ఇండియన్ రైల్వే. జమ్మూ కాశ్మీర్ లోని చెనాబ్ నదిపై రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. ఇది పారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన పొడవు 1.3 కిలోమీటర్లు.

ఈ రైల్వే వంతెన ప్రాజెక్టును కొంకణ్ రైల్వే నిర్మిస్తోంది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకు 1,400 మంది శ్రామికులు పనిచేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం 2004 లో ప్రారంభమైంది. మధ్యలో అధిక గాలుల కారణంగా 2008లో పోస్ట్ పన్ అయ్యింది. మళ్లీ తిరిగి ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకోగలదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. దాదాపు దీని జీవిత కాలం 120 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు.

కాట్రా, బనిహాల్ ప్రాంతాల మధ్య ఈ వంతెన కీలక మార్గం కానుంది. అంతేకాదు ప్రపంచంలోనే నదికి రెండు పక్కల మాత్రమే సపోర్ట్ చేసుకుని.. మధ్యలో ఏ సపోర్ట్ లేకుండా ఉన్న వంతెనల్లో ఇది ఏడోది కావడం విశేషం. ఈ వంతెన పూర్తయిన వెంటనే ఇండియన్ రైల్వే దీని మీద నుంచి బంగీ జంప్ వంటి సాహస కృత్యాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.