Xi Jinping In India : ఏడేళ్ల తరువాత భారత్ గడ్డపై అడుగుపెట్టిన చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్..

Xi Jinping In India : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో గడ్డపై అడుగుపెట్టారు.

Xi Jinping In India

Xi Jinping In India : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌ గడ్డపై అడుగుపెట్టారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. 2019లో మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోదీతో అనధికారిక సమావేశం తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. అయితే, బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ మధ్య శనివారం సాయంత్రం 5.45 గంటల సమయంలో కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో భారత్‌-చైనా సంబంధాలతో పాటు సరిహద్దు పరిస్థితులు, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 2020 గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.