AirAsia CEO Tony Fernades Massage
AirAsia CEO Tony Fernades Massage in meeting : ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఆయన షర్టు విప్పి అమ్మాయితో మసాజ్ చేయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంత వర్చువల్ మీటింగ్ అయితే మాత్రం మరీ ఇలా చేయటం ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్టు లేకుండా మసాజ్ చేయించుకున్న ఫోటోను ఆయనే స్వయంగా లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయటం గమనించాల్సిన విషయం.
తను ఎందుకు ఇలా చేశానో అనే విషయాన్ని ఆయన వివరిస్తు..ఈ వారం అంతా చాలా ఒత్తిడికి గురయ్యానని అందుకే మసాజ్ చేయించుకుంటే ఒత్తిడి తగ్గి రిలీఫ్ గా ఉంటుందని అందుకే ఇలా చేశాను అంటూ వివరించారు. మసాజ్ చేయించుకుంటే రిలీఫ్ గా ఉంటుందని ఎయిరేషియా ఇండోనేషియా సీఈవో వెరానిటా యోసెఫిన్ సూచించారని తెలిపారు. నేను మసాజ్ చేయించుకుంటు కూడా మీటింగ్ ను మేనేజ్ చేయగలను అంటూ చెప్పుకొచ్చారు.
Cm Yogi Adityanath : సీఎం యోగీ దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్ ఫ్రీ
అంతేకాదు నాకు ఇండోనేషియా అన్నా..ఎయిర్ ఏషియా సంస్కృతి అంటూ ఎంతో ఇష్టమని..ఓ సంస్థగా మేం చాలా డెవలప్ అయ్యామని తెలిపారు. మేం సాధించిన డెవలప్ మెంట్ విషయంలో తాము గర్విస్తున్నామని అంటూ టోనీ ఫెర్నాండెజ్ లింక్డ్ ఇన్ లో వెల్లడించారు.