King Cobra Viral : ఇంటిలోకి దూరిన 14 అడుగుల కింగ్ కోబ్రా..

తమిళనాడులో ఓ పక్క భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతుంటే మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. తమిళనాడులోని ఓ ఇంటిలో భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు అధికారులు.

King Cobra Bhagavathipuram

King Cobra In House : తమిళనాడులో ఓ పక్క భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతుంటే మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. తమిళనాడులోని భగవతీపురంలో ఓ ఇంటిలో భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు అధికారులు. భగవతీపురంలోని ఓ ఇంటిలోకి ఏకంగా 14 అడుగుల అత్యంత విషసర్పమైన కింగ్ కోబ్రా ప్రవేశించింది. దీంతో వారు అటవీశాఖ, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

దీంతో అధికారులు ఆ ఇంటికి చేరుకుని అత్యంత చాకచక్యంగా కష్టపడి కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. దాని ఓ సంచిలో వేసే సమయంలో కూడా అత్యంత చాకచక్యంగా వేసారు. ఆ తరువాత కూడా ఆ పాము సంచిలో చాలా వేగంగా కదలటంతో దాన్ని బలంగా పట్టుకుని సంచిలో జారవిడిచి బంధించారు. ఆ సంచినీ మరో సంచిలో వేసిన అక్కడినుంచి తరలించారు. దాన్ని అడవిలో వదిలివేస్తామని అధికారులు తెలిపారు. కింగ్ కోబ్రోను పట్టుకున్న అధికారులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు