maharashtra Villege sarpanch Rs.2 lakh currency notes threw
Maharashtra : లంచం..లంచం..లంచం. ప్రభుత్వ అధికారులంటే లంచం ఇవ్వందే పనిచేయరు అనే ఆరోపణలు కొనసాగుతునే ఉన్నాయి. చిన్నపని చేయాలన్నా చేయి తడపాల్సిందే. లేదంటే పని జరగదు.అలా లంచం అడిగిన ఓ ప్రభుత్వ అధికారికి ఓ గ్రామ సర్పంచ్ వినూత్న రీతిలో బుద్ధి చెప్పాడు. గ్రామంలో సాగునీటి సమస్య పరిష్కారానికి మంజూరు అయిన బావులు తవ్వుకోవాలంటే లంచం ఇవ్వాల్సిందేనన్నాడు ఓ ప్రభుత్వ అధికారి. కానీ గ్రామంలో రైతులంతా పేదవారు..డబ్బులు ఇచ్చులేరు దయచేసిన బావులు తవ్వుకోవానికి అనుమతి ఇవ్వండీ అని వేడుకున్నా..ఆ అధికారికి ఏమాత్రం మనస్సు రాలేదు. డబ్బులు ఇస్తేనే అనుమతి ఇస్తానని లేదంటే క్యాన్సిల్ చేసేస్తానని బెదిరించాడు. దీంతో ఎంతో కష్టపడితేనేగానీ మంజూరు అయిన బావులు ఎక్కడ దక్కుండా పోతాయోనని ఆందోళన చెందిన సర్పంచ్ సదరు అధికారి అడిగినంత డబ్బులు తెచ్చి వినూత్న రీతిలో రోడ్డుపైనే వెదజల్లి సదరు అధికారి పరువును నడిరోడ్డుపై పడేశాడు.
మహారాష్ట్రలోని శంబాజీనగర్ జిల్లా పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్ పయాగ్ గ్రామ సర్పంచ్ పేరు మంగేష్ సాబడే. గ్రామంలో వ్యవసాయం చేయాలంటే నీటి సమస్య ఉంది. దీంతో రైతులతో కలిసి సర్పంచ్ మంగేష్ సాబడే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు తమ గ్రామానికి బావులు మంజూరు చేయాలని..అలా కొంతకాలం పోరాటం తరువాత ఎట్టకేలకు గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరు అయ్యాయి. ఒక్కోబావికి రూ.4లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం మొత్తం 20 బావుల్ని తవ్వుకోవటానికి మంజూరు చేసింది. కానీ దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నాడన్నట్లుగా ఆ బావులు తవ్వుకునే పనులు ప్రారంభించాలంటే స్థానిక అధికారుల అనుమతి ఇవ్వాలి. దీంతో సర్పంచ్ మంగేష్ బీడీవో (బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్) కలిసి అనుమతి ఇవ్వాలని కోరాడు. దీనికి సదరు అధికారి మంజూరు అయిన దాంట్లో దాదాపు 12 శాతం తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దానికి మాగ్రామంలో రైతులు పేదవారు..అంత డబ్బు ఇచ్చుకోరని దయచేసిన అనుమతి ఇవ్వాలని విన్నవించుకున్నాడు. కానీ సరదు అధికారి డబ్బు ఇస్తేనే సంతకం చేస్తానని లేదంటే మంజూరు అయిన బావులు క్యాన్సిల్ అయిపోతాయని బెదరించాడు.దీంతో సదరు సర్పంచ్ కు కోపం వచ్చింది. ఇటువంటి అధికారులు బుద్ధి చెప్పాల్సిందనని నిర్ణయించుకున్నాడు.రూ.100, రూ.500 నోట్లతో ఓ దండ తయారు చేయించి దాన్ని మెడలో వేసుకుని శుక్రవారం ( మార్చి31,2023) ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి..రోడ్డుమీద నిలబడి డబ్బు వెదజల్లాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మంత్రి గిరీష్ మహాజన్ బీడీవోను సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు.
దీనిపై సర్పంచ్ మంగేష్ సాబడే మాట్లాడుతూ..ఎంతో కష్టపడి బావుల్ని మంజూరు చేసుకున్నాం..కానీ ఇటువంటి అధికారుల లంచగొండితనానికి రైతులు బలి అయిపోతున్నారు. నేను ఇలా వెదజల్లిన డబ్బులు పేద రైతుల నుంచి సేకరించిందేనని..కానీ ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇక రైతులు పరిస్థితి ఏంటీ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.