×
Ad

Red Wine River Viral Video : వీధుల్లో ప్రవహించిన రెడ్ వైన్ నది ..

వీధుల్లో రెడ్ వైన్ ప్రవహించింది. భారీ వర్షాలు వచ్చినప్పుడు నదులు పొంగి పోటెత్తి వీధుల్లో ప్రవహిస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలా రెడ్ వైన నడి వీధుల్లో నదిలా ప్రవహించింది.

  • Published On : September 12, 2023 / 10:42 AM IST

red Wine Flowed In Portugal Town

red Wine River In Portugal Town : వీధుల్లో రెడ్ వైన్ ప్రవహించింది. భారీ వర్షాలు వచ్చినప్పుడు నదులు పొంగి పోటెత్తి  నదులు పొంగి వీధుల్లో ప్రవహిస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలా రెడ్ వైన నడి వీధుల్లో నదిలా ప్రవహించింది. పోర్చుగల్ (Portugal )లోని ఓ పట్టణంలోని వీధిలో ఏకంగా 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్ వీధిలో నదిలా ప్రవహించింది. ఈ రెడ్ వైన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒలింపిక్ లో స్మిమ్మింగ్ పూల్ ఉండే పరిమాణంలో రెడ్ వైన్ నది కనిపిస్తోంది.

Libya floods : లిబియా వరదల్లో 2వేల మంది మృతి, వేలాదిమంది గల్లంతు

పోర్చుగీస్ లోని సావో లోరెంకో డి బైరో (Sao Lorenco de Bairro)లోని వైన్ తయారీ పరిశ్రమలో 600,000 గ్యాలన్ల మద్యాన్ని నిల్వచేసిన బారెల్స్ ఊహించని విధంగా కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. నదీ మాదిరిగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించిన దృశ్యాలను కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Kim Jong Un : పుతిన్‌ను కలిసేందుకు రష్యాకు రైలులో బయలుదేరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

లీక్ అయిన ఈ రెడ్ వైన్ ఒలింపిక్-స్విమ్మింగ్ పూల్‌ని తలపిస్తోంది. వైన్‌ని ఆపడానికి అగ్నిమాపక విభాగం ప్రయత్నించింది. అయినా సాధ్యంకాలేదు. కానీ అనాడియా ఫైర్ డిపార్ట్‌మెంట్ ఈ రెడ్ వైన్ వరదను సెర్టిమా నదిలో కలవకుండా వేరే మార్గానికి మళ్లించింది. అక్కడి నుంచి వైన్ ప్రవాహం సమీపంలోని పొలంలోకి వెళ్లిందని స్థానిక మీడియాను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.