Raksha bandhan 2023 : భారత్‌పై దండెత్తిన అలెగ్జాండర్ ప్రాణాలను కాపాడిన ‘రక్షాబంధన్’.. ఎలాగో తెలుసా?

ఓ రాఖీ రక్తపాతానికి అడ్డుకట్ట వేసింది. తన మాతృదేశంపై కన్నేసిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ భార్యకు భారతీయ రాజు పురుషోత్తముడు ఇచ్చిన మాట వెనుక ఓ రాఖీ సెంటిమెంట్ ఉంది. రాఖీ అంటే కేవలం చేతికి కట్టే ఓ తాడు కాదని..యుద్ధాన్ని ఆపిన ఘనత కూడా ఉందని నిరూపించిన చరిత్ర ఉంది..

alexander wife Indian king purushothamudu rakhi

Raksha Bandhan 2023 : గ్రీకు వీరుడు అలెగ్జాండర్ (alexander)అంటే ఠక్కున గుర్తుకొచ్చేది జగజ్జేత అనే మాట. ‘అలెగ్జాండర్ ది గ్రేట్‌'(The Great alexander)గా చిరస్థాయి గుర్తింపు తెచ్చుకున్న సాహసి అతను. 12 ఏళ్లకే అదుపు తప్పిన గుర్రానికి కళ్లెం వేసి వారెవ్వా అనిపించుకున్న గ్రీకు యువరాజు. తనకు కళ్లె వేసిన అలెగ్జాండర్ కు బుసెఫాలస్ అనే ఆ అడవి గుర్రం జీవితాంతం తోడుగా ఉండిపోయింది. చిన్నతనం నుంచే అతనిలో ఒక వీరుడి లక్షణాలు కనిపించేవి. అతని ముఖాన్ని చూస్తే అతను చరిత్రలో ఒక అసాధారణ వ్యక్తిగా మిగిలిపోతాడు అనిపించేలా ఉండే ఆ నూనూగు మీసాల యువకుడు తండ్రి మరణంతో 20ఏళ్లకే రాజు అయ్యాడు. ఎన్నో రాజ్యాలు జయించాడు.

వరుస విజయాలతో ప్రపంచాన్ని జయించాలనే కాంక్ష ఆ యువకుడిలో బలంగా నాటుకుంది. ఆ కాంక్షతోనే అఖండ సైన్యంతో ఎన్నో రాజ్యాలను జయించి హస్తగతం చేసుకున్నాడు. ప్రపంచాన్ని జయించాలన్న కాంక్షతో తన సైనికులతో దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. అలా గ్రీస్(Greece), ఈజిప్ట్(Egypt), ఇరాన్(Iran), టర్కీ(Turkey), ఇరాక్(Iraq), ఆఫ్ఘనిస్తాన్( Afghanistan) సరిహద్దుల వరకు రాజ్యాన్ని విస్తరించాడు. అలెగ్జాండర్ దృష్టి పడితే ఇక ఆరాజ్యం అతని స్వాధీనం కావాల్సిందే. అతని పరాక్రమం అటువంటిది. దానికి తోడు అపారమైన సైన్యం అలెగ్జాండర్ సొంతం.

అఖండ భారత్ ను కూడా జయిస్తే ఇక జగజ్జేత తానే అనుకున్నాడు. అప్పుడు అఖండ భారత్ పాకిస్తాన్(Pakistan), బంగ్లాదేశ్(Bangladesh), బర్మా(Burma), టిబెట్( Tibet), ఆఫ్గానిస్తాన్(Afghanistan), శ్రీలంక(Sri Lanka), నేపాల్(Nepal), భూటాన్ (Bhutan)లను కలిపి అఖండ భారత్ గా ఉండేది. అంటే బ్రిటిష్ పాలనకు ముందున్న భారతదేశం. పలు రాజ్యాలుగా భారత్ ఉండేది. ఒక్కో రాజ్యాన్ని ఒక్కోరాజుపాలించేవారు.  అంగ, కాశీ, కోసల, మగధ, వజ్జి, అవంతి, కాంభోజ, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక, గాంధార,మల్ల, చేది, వత్స అనే 16 మహాజనపద రాజ్యాల సమూహంగా భారత్ ఉండేది. ఈ రాజ్యాలన్నింటిని ఓడిస్తేనే భారత్ ను గెలిచినట్టు అని పర్షియన్లు అలెగ్జాండర్‌ భావించాడు. అలా అఖండ సైన్యంతో క్రీ.పూ. 326వ సంవ‌త్స‌రంలో అలెగ్జాండర్ భారత్ సరిహద్దులకు చేరాడు.

Raksha bandhan 2023 : కర్రలకు రాఖీ కట్టే ఆచారం .. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు, ఒక్కో ఊరిదీ ఒక్కో కథ

కానీ భారత్‌ శక్తివంతమైన దేశమని..యోధాను యోధులకు భారత్ పుట్టినిట్లు అని భావించిన అతని శ్రేయోభిలాషుల సలహా మేరకు కొంతకాలం వేచి ఉన్నాడు. అలా సమయం కోసం ఎదురు చూస్తున్న అలెగ్జాండర్ ను తక్షశిల రాజు అంబి వచ్చి కలిశాడు. నేను మీతో యుద్ధం చేయను అన్నాడు. గ్రీకు రాజ్యానికి సామంతుడిలా ఉండడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు. ఆ మాట విన్న అలెగ్జాండర్ ఆశ్చర్యపోయిండు. ఒక్క చుక్క రక్తం చిందకుండానే గాంధార లాంటి పెద్ద రాజ్యం తన సొంతం అవుతున్నందుకు సంతోషపడ్డాడు. మరి నీకు కావాల్సింది ఏంటీ అని అడిగాడు అలెగ్జాండర్ అంభిని.తన మనసులో మాట చెప్పిండు అంభి.పాంచాలపై దండెత్తాలని కోరాడు.

అంబి పొరుగు రాజ్యం పాంచాల (ఇప్పటి పంజాబ్‌) రాజ్యానికి రాజు ‘పురుషోత్తముడు’(purushothamudu). అంబి(ambi)కి పురుషోత్తముడికి శతృత్వం ఉండేది. పాంచాలని ఆక్రమించాలని అంబి ఆశ. కానీ పురుషోత్తముడు పరాక్రమం ముందు ఓడిపోతాడని అతనికి తెలుసు. ఎందుకంటే పురుషోత్తముడు అపర పరాక్రమవంతుడు. పురుషోత్తముడిని ఓడించే శక్తి అతనికి లేదు. దీంతో అలెగ్జాండర్‌ వద్ద చేరాడు అంబి. అతడిని పాంచాలపైకి యుద్ధానికి ఉసికొలుపుతాడు. దానికి తను సహకరిస్తానంటాడు. శతృవుకు శతృవు మిత్రుడు అనే పద్ధతిని అంబి పాటించాడు. పురుషోత్తముడిని ఓడించాలి..దానికి తాను సరిపోడు. అలెగ్జాండర్ లాంటి శక్తిమంతుడు అయితే తాను అనుకున్నది జరుగుతుందని భావించాడు. అలెగ్జాండర్‌కు కావాల్సింది కూడా అదే. అలా క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తాడు అలెగ్జాండర్‌. ఈ క్రమంలో బాక్ట్రియా (ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌)కు చెందిన యువరాణి ‘రోక్సానా’ను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహాన్ని అడ్డు పెట్టుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన.

అలా ‘రోక్సానా’ను వివాహం చేసుకున్న తరువాత భారత్ పై దండెత్తాడు.అంభి అండగా నిలవడంతో ఇక గెలుపు సులభమనుకున్నడు అలెగ్జాండర్.. తన పేరు చెపితేనే పురుషోత్తముడు భయపడతాడనుకుని రాయబారిని పంపిండు. సంధికి ఒప్పుకుంటే సామంతుడిగా ఉండనిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఆ మాట విన్న పురుషోత్తముడి రక్తం కుతకుత ఉడికిపోయింది. కదన రంగంలో తన కత్తి చివర అలెగ్జాండర్ తల ఉన్నప్పుడు మాత్రమే సంధి గురించి మాట్లాడతానని ధీటుగా సమాధానం ఇచ్చాడు. యుద్ధానికి సన్నాహాలు సిద్ధమయ్యాయి.

Raksha Bandhan 2023 : భద్ర కాలంలో రాఖీ అస్సలు కట్టొద్దు .. మరి ఈ ఏడాది రాఖీ ఎప్పుడు కట్టాలి? ఆగస్టు 30 నా..? 31నా..?

కానీ పురుషోత్తముడి పరాక్రమం గురించి తెలిసిన అలెగ్జాండర్ భార్య రోక్సానా ఆందోళన చెందింది. యుద్ధంలో పురుషోత్తముడి చేతిలో తన భర్తకు ఓటమి తప్పదని ఆమె మనసు కీడును శంకించింది. దీంతో పురుషోత్తముడి గుణగణాలు తెలిసిన రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. రాఖీ కట్టినందుకు సంతషించిన పురుషోత్తముడు రోక్సానాను తన సొంత చెల్లి అంటూ ప్రకటిస్తాడు. రాఖీ కట్టిన చెల్లిగా ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ను చంపే సందర్భం వస్తే చంపవద్దని ప్రాణాలతో వదిలేయాని కోరుతుంది. సరేనంటాడు పురుషోత్తముడు.

యుద్దం రానే వచ్చింది. యుద్ధంలో ఆజానుబాహుడైన పురుషోత్తముడి కళ్లలో కనిపించిన కసిని చూసి అలెగ్జాండర్ ముచ్చటపడ్డడు. యుద్ధంలో నాకు సరైన జోడి అనుకున్నాడు. పురుషోత్తముడి వీరత్వం గురించి అంభి చెప్పింది నిజమే అనుకున్నాడు. అన్ని రాజ్యాలను అవలీలగా జయించిన అలెగ్జాండర్ వీరత్వం అలెగ్జాండర్ కండ బలం పురుషోత్తముడి పరాక్రమం ముందు పని చెయ్యలేదు. అలెగ్జాండర్‌ తల పురుషోత్తముడి కత్తికి బలి అయ్యే సమయం.. రోక్సానా రాఖీ కట్టినపుడు ఆమెకు ఇచ్చిన మాట గర్తుకు వచ్చి అలెగ్జాండర్‌ను చంపకుండా వదిలేస్తాడు పురుషోత్తముడు. చెల్లికి ఇచ్చిన మాట కోసం పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను వదిలేసినట్లు చరిత్ర చెబుతుంది.. అలా రాఖీ వల్ల ఆ యుద్దం అక్కడితో ఆగిపోయింది..అలా జగజ్జేత అలెగ్జార్ కు పురుషోత్తముడి చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆ పరాజయం అలెగ్జాండర్ కు చాలా నేర్పించింది. అసలు ఈ యుద్ధమేంటీ..? అనే ఆలోచన కూడా వచ్చింది. యుద్ధంపై అలెగ్జాండర్ కు విరక్తి కలిగిందని చరిత్ర చెబుతోంది. అలా యుద్ధంలో గాయపడిన అలెగ్జాండర్ అతి చిన్న వయస్సులోనే మరణించాడు.

అలా ఓ రాఖీ ద గ్రేట్ అలెగ్జాండర్ యుద్ధ కాంక్షకు ఫుల్ స్టాప్ పెట్టింది. భారత్ లో చవి చూసిన ఓటమితో జగజ్జేత అవ్వాలనే కాంక్షను కూడా అలెగ్జాండర్ విడనాడే పరిస్థితికి కారణమైంది. ఓ రాఖీ రక్తపు దాహానికి అడ్డుకట్ట వేసింది.

 

ట్రెండింగ్ వార్తలు