Any Time Bag : హైదరాబాద్‌లో ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్, నిమిషంలో చేతికొచ్చే కాటన్ బ్యాగ్, ఎక్కడంటే..

ఏటీఎంలో డెబిల్ కార్డు పెడితే డబ్బులొస్తాయి. కానీ హైదరాబాద్ ఓ ఏటీబీ ఏర్పాటు చేేశారు అధికారులు. ఏటీబీ అంటే ఎనీ టైమ్ బ్యాగ్ అన్నమాట..

Any Time Bag

Any Time Bag : ఎక్కడ చూసినా ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ అనేది పర్యవరణానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తోంది. ఇదివరకులా ఇంటినుంచి బయటకెళ్లేటప్పుడు ఓ సంచి పట్టుకెళ్లే అలవాటు పోయింది. బయట ఏమి కొన్నా ప్లాస్టిక్ సంచీలు అందుబాటులో ఉంటాయిగా అనే ఆలోచన. కానీ ఆలోచన పోవాలి..ప్లాస్టిక్ బ్యాగుల వాడకం మానాలి అనే మంచి ఉద్ధేశంతో హైదరాబాద్ (Hyderabad) మహానరగంలోని కూకట్‌పల్లి(Kukat Palli)లోని ఐడీపీఎల్‌ (IDPL) ఏరియాలో ఎనీ టైమ్‌ బ్యాగ్‌ (ATB) మిషన్‌ను ఏర్పాటు చేశారు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు.

ఐడీపీఎల్‌ పండ్ల మార్కెట్‌ (Fruit market)లో ఏర్పాటు చేసిన ATB మెషిన్‌లో రూ.10 రూపాయలు నోటు లేదా కాయిన్‌(Rs. 10 Rupees)ను వేస్తే వెంటనే ఏటీఎంలో డబ్బులు వచ్చినట్లుగా ఓ కాటన్ బ్యాగ్ (Cotton bag)బయటికి వస్తుంది. ఈ బ్యాగు దాదాపు 5 కేజీల వరకు బరువును మోసే సామర్థ్యం కలదిగా ఉండేలా డిజైన్ చేశారు అధికారులు.

సోలార్‌ విద్యుత్‌(Solar electricity)ను వినియోగించుకుని పనిచేసేలా ఈ వెండింగ్‌ మిషన్‌ను తయారు చేశారు. మొవేట్ (MOVATE), యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థలు ఈ Any Time Bag మిషన్‌ ఈ బ్యాగులు కూరగాయలు, పండ్లు, మార్కెట్‌ల నుంచి కిరాణా సరుకులు ఇలా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ Any Time Bag మిషన్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. దీంతో త్వరలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఐడీపీఎల్‌లో ఎనీ టైమ్‌ బ్యాగ్‌ మిషన్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత ట్విటర్‌ లో పోస్ట్ చేశారు. ATB మిషన్‌ భలే ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.