Eve Tilley Coulson offer for Husband
US Woman’s offer for Husband : సోషల్ మీడియాలో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నా ఓ అందాల భామ పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. తనకు భర్త అయ్యే వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉండాలో కూడా చెప్పింది. అటువంటి వ్యక్తిని వెతికి తనకు సమాచారం అందిస్తే భారీ బహుమతి కూడా ఇస్తానంటు ప్రకటించింది. ఒంటరితనంతో విసిగిపోయాను నాకో తోడు కావాలంటోంది. మరి ఎవరీ అందాల భామ..?ఆమెకు కాబోయే భర్తకు ఎటువంటి లక్షణాలు ఉండాలని చెబుతోందంటే..
అమెరికా(America)లోని లాస్ ఏంజెల్స్ (Los Angeles)కు చెందిన 35 ఏళ్ల మహిళ. ఆమె పేరు ఈవ్ టిల్లీ కౌల్సన్(Eve Tilley Coulson). ఆమెకు టిక్ టాక్ లో 10లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. తాను వివాహం చేసుకోవాలనుకుంటోందట. డేటింగ్ లకు విసిగిపోయి ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. అలా ఒంటరితనం బోర్ కొట్టిందట. అందుకే వివాహం చేసుకోవాలనుకుంటోంది. దీంతో ఆమె పనిచేసే ఆఫీసు బాస్ కు, స్నేహితులకు, కొలిగ్స్ కు ఈ విషయం చెప్పింది. తన చెప్పిన లక్షణాలు ఉండే వ్యక్తిని వెతికిపెడితే 5వేల డాలర్లు ఇస్తానని చెప్పింది. ఆ తరువాత ఆమె అందరికి సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తు ఈ ఆఫర్ ఇచ్చింది.
Dosa Sambar : దోసెలోకి సాంబార్ ఇవ్వని హోటల్‌కు జరిమానా..
ఒంటరితనంతో విసుగుచెందిన అమెరికాకు చెందిన ఓ మహిళ తనకు భర్తను వెతికి పెట్టిన వారికి 5000 డాలర్ల మొత్తాన్ని బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. ఇది మన కరెన్సీలో రూ.4 లక్షలకు పైగా ఉంటుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, లాస్ ఏంజిల్స్‌కు చెందిన 35 ఏళ్ల కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీ ఈవ్ టిల్లీ కౌల్సన్ తనకు నచ్చిన లక్షణాలు కలిగిన వ్యక్తిని వెతికి పెట్టడంలో సహకరించిన వారికి భారీ మొత్తాన్ని అందిస్తామని టిక్ టాక్ లో వీడియో ద్వారా అప్పీల్ చేసింది. ఆమెకు పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కరోనా తరువాత డేటింగ్ కల్చర్ లో మార్పులు వచ్చేశాయని అవి తనకు నచ్చటంలేదని అందుకే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెబుతోంది.
తనకు నచ్చిన వ్యక్తి ఎలా ఉండాలో తెలిపింది. అతని వయస్సు 27 నుండి 40 ఏళ్లు ఉండాలని..ఎత్తు 5.11 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని తెలిపింది. అలాగే సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉండాలట. ఆడలపై ఇష్టం కలిగి ఉండాలి. అంతేకాదు. చిన్నపిల్లలంటే ఇష్టపడాలి. జంతువులంటే ప్రేమ చూపాలి. అలాగే మరి ముఖ్యంగా మానవ బంధాల విషయంలో సీరియస్ గా ఉండాలని స్పష్టంచేసింది. అతను అవివాహితుడై ఉండాలి. మాదకద్రవ్యాలు వంటి అలవాట్లు అస్సలుఉండకూడదు అని తెలిపింది. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆంక్షలు లేవని..అంటే జాతి, మత, రాజకీయాలు వంటి విషయాలు తనకు పట్టింపు లేదని చెప్పింది. మాదకద్రవ్యాలు తీసుకోకూడదని, అతను అవివాహితుడై ఉండాలన్నారు.
Pak woman Seema Haider : ‘గదర్’ ప్రేమకథా చిత్రం అంటే నాకెంతో ఇష్టం…పాక్ మహిళ సీమా హైదర్ వెల్లడి
ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిని గుర్తించి తనకు చెప్పాలని కోరింది. అటువంటి వ్యక్తిని వెతికి పెడితే 5,000 అమెరికన్ డాలర్లు ఇస్తానని అంటే మన కరెన్సీలో రూ.4 లక్షలుపైనే ఇస్తానని చెప్పింది. తన పెళ్లి సర్టిఫికెట్ చేతికి రాగానే సంబంధం వెతికి పెట్టిన వారికి తాను ప్రకటించిన బహుమతి ఇస్తామని తెలిపింది.