Video: పెళ్లి బరాత్‌లో అందరూ హాయిగా డ్యాన్స్ చేస్తుంటే.. మధ్యలో వచ్చి కలకలం రేపిన యువకుడు
Video: రోడ్డుపై కాల్చాల్సిన బాణాసంచా బాక్సును తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు ఆ యువకుడు.
- T Venkateshwarlu
- Published On : April 16, 2024 / 09:37 PM IST
Viral Video
బాణసంచాను తలపై పెట్టుకుని కాల్చాడు ఓ యువకుడు. చివరకు అది అతడి స్వెటర్ పై పడడంతో దానికి నిప్పు అంటుకుంది. దీంతో అతడు బాణసంచా డబ్బను వదిలేయడంతో అది నేలపై పడి మంటలు చెలరేగాయి. అక్కడున్న వారంతా పరుగులు తీశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజకి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రోడ్డుపై కాల్చాల్సిన బాణాసంచా బాక్సును తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు ఆ యువకుడు. ఒక వివాహ బరాత్ లో ఈ ఘటన జరిగింది. అందరూ డ్యాన్స్ చేస్తూ కంటెయినర్ నుంచి వెళ్లే రాకెట్ బాణసంచాను కాల్చారు.
రాకెట్లు పైకి దూసుకుపోయే సమయంలోనే ఆ యువకుడు దాన్ని పైకి లేపాడు. అతడు మద్యం తాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారే వేడుకలో విషాదం నింపుతారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి వారిని పెళ్లికి పిలవకూడదని, పిలిచినా బరాత్ కు రానివ్వకూడదని, రానిచ్చినా మద్యం తాగనివ్వకూడదని, తాగనిచ్చినా బాణసంచా వద్దకు వెళ్లనివ్వకూడదని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు.
ऐसे खुराफाती लोग ही बारात की लुटिया डुबोते हैं ??
दो शब्द बोलो इनके बारे में pic.twitter.com/bnU5v3qZ2J— Kartik Meena (@KARTIKMEENA005) April 12, 2024
