man gifts wife piece of land on Moon
Chandrayaan-3 West Bengal gifts wife land on the Moon : చంద్రుడుపై స్థలం కొన్నారని భార్యకు గిఫ్టు ఇచ్చారని..తమ పిల్లలకు గిప్టు ఇచ్చారనే వార్తలు విన్నాం. తాజాగా భారత్ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం తరువాత ఇక చంద్రుడిపై స్థలాలు కొనేయటం జరుగుతోందా..? అంటే నిజమేనంటు కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చంద్రయాన్-3కు ముందు ఇటువంటి వార్తలు వచ్చినా చంద్రయాన్-3 విజయం తరువాత ఇటువంటి వార్తలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.
చంద్రయాన్ -3 విజయం తరువాత పశ్చిమ బెంగాల్ (West Bengal) కు చెందిన ఓ వ్యక్తి చంద్రుడిపై ఏకంగా ఎకరం స్థలం (land on the Moon)కొని భార్యకు పుట్టిన రోజు కానుక(birthday Gift)గా ఇచ్చాడనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని ఝర్ గ్రామ్ జిల్లా(Jhargram district)కు చెందిన సంజయ్ మహతో (Sanjay Mahato), అనుమిక దంపతులు. వీరిది ప్రేమ వివాహం. గత ఏప్రిల్ లోనే వీరి వివాహం జరిగింది. సాధారణంగా ప్రతీ ప్రియుడు తన ప్రియురాలిని ఇంప్రెస్ చేయటానికి ఎన్నో మాటలు చెబుతాడు. చందమామ కంటే నువ్వే అందంగా ఉన్నావంటాడు. నువ్వు అడగాలే గానీ ఆ చందమామనే నీకు కానుగా ఇస్తానంటాడు. జాబిల్లి తెచ్చి నీ శిగలో పువ్వులా అలంకరిస్తానంటాడు. అదిగా అచ్చంగా అలాంటి బాసలే చేశాడు సంజయ్ మహతో కూడా వారు ప్రేమించుకునే రోజుల్లో. నువ్వు నాకు తోడుగా ఉంటే నీకు ఆ చందమామనే బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశాడట. అలా అతను ఇచ్చిన మాటను చంద్రుడిపై ఎకరం స్థలం కొని మరీ నిజం చేసి చూపించాడు.
Maharashtra : మంచంపై నుంచి కిందపడ్డ మహిళ, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసిన కుటుంబం
ఈక్రమంలో చంద్రయాన్ -3 విజయంతో తన భార్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సంజయ్ తన భార్య అనుమిక పుట్టినరోజు సందర్భంగా చంద్రుడిపై ఎకరం స్థలం కొని కానుకగా ఇచ్చాడు. వారి వివాహం జరిగిన తరువాత భార్య మొదటి పుట్టిన రోజున సంజయ్ తను వివాహానికి ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనుకున్నాడు. చంద్రయాన్ -3 విజయం తరువాత తను తన భార్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఎకరం స్థలం కొనేసి పుట్టిన రోజు కానుకగా ఇచ్చేశాడు.
మరి భూమ్మీద ధరలు మండిపోతున్నాయి. మరి చంద్రుడిపై స్థలం అంటే మాటలా ధర ఎంత ఉంటుందో అనే ఆసక్తి రావటం సాధారణమే. మరి సంజయ్ చంద్రుడిపై కొన్న స్థలం రూ.10,000లట. మరి చంద్రుడిపై స్థలాలను ఎవరు అమ్ముతున్నారు..? అనే డౌట్ కూడా వచ్చే తీరుతుంది. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ అమ్మకాలు సాగిస్తోంది. దీంతో సంజయ్ తన స్నేహితుడి సహాయంతో లూనా సంస్థ ద్వారా ఎకరం స్థలాన్ని రూ.10 వేలకు కొని..దానికి సంబంధించిన సర్టిఫికెట్ ను భార్యకు కానుకగా ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు తన భార్య అనుమిక కళ్లలో ఆనందం చూసి సంజయ్ మహతో తెగ మురిసిపోయాడు.ఆమె కళ్లల్లో ఆనందం కోసం ఏదైనా చేస్తానంటున్నాడు.
Siddaramaiah : ఆలయంలోకి రావాలంటే నన్ను షర్టు విప్పమన్నారు: సీఎం సిద్దరామయ్య
కాగా..మీరు కూడా మరిం చంద్రుడిపై ఓ ప్లాట్ కొనేద్దామనుకుంటున్నారా..? దానికి కూడా ఎంతో సమయం పట్టదట. ఓ ఏడాదిలో ఇది సర్వసాధారణంగా మారిపోతుందంటున్నారు. కాగా ఇప్పటి వరకు చంద్రుడిపై స్థలం కొంటున్నారని సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారని వింటున్నాం. మరి ఆ సర్టిఫికెట్లు చెల్లుతాయా..? లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చంద్రుడిపై స్థలం ఎవరికీ చెందినది కాదు. అక్కడ ఓనర్ షిప్ కూడా ఎవ్వరికి సాధ్యం కాదు. కానీ కొన్ని సంస్థలు మాత్రం చంద్రుడిపై స్థలాన్ని విక్రయిస్తూ, వినియోగదార్లకు ఆ స్థలం తాలూకు సర్టిఫికెట్లను అందిస్తున్నాయి. ఇది చెల్లుబాటు అవుతుందా..?లేదా..? అని ఆలోచించకుండా కొంతమంది కొనటానికి ముందుకు రావటం గమనించాల్సిన విషయం అనే చెప్పుకోవాలి.
2020లో రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఓ వ్యక్తి తమ వివాహ వార్షికోత్సం సందర్భంగా తన భార్యకు చంద్రుడి మూడు ఎకరాల స్థలం కొని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో ఆ వార్త హల్ చల్ అయ్యింది. అంతేకాదు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singh Rajput) కూడా 2018లో చంద్రుడి అవతలి వైపున ఉన్న మారే ముస్కోవియన్స్ లేదా “సీ ఆఫ్ ముస్కోవి” అని పిలువబడే ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. నటులు షారూఖ్ ఖాన్(Shah Rukh Khan ), సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ల ప్రేరణతో బోధ్ గయా (Bodh Gaya)నివాసి, నీరజ్ కుమార్ ( Neeraj Kumar) కూడా తన పుట్టినరోజున చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశాడు.