Samsung Galaxy M17e 5G : వారెవ్వా.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy M17e 5G : అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ సందర్భంగా శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M17e 5G ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/7
Samsung Galaxy M17e 5G : శాంసంగ్ లవర్స్ కు పండగే పండగ.. అమెజాన్ ప్రైమ్ డే 10వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 4 నుంచి జూలై 6 వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరుగనుంది. ఈ సేల్ సమయంలో శాంసంగ్, ఐఫోన్‌తో సహా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకు లభించనున్నాయి.. వార్షికోత్సవ డీల్స్, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, అదనపు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, శాంసంగ్, హైయర్, టీసీఎల్, షావోమీ వంటి బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలపై కూడా అద్భుతమైన డిస్కౌంట్లు పొందవచ్చు.
2/7
అమెజాన్ సేల్ సందర్భంగా బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ప్రతి ఫోన్ కేటగిరీలో వేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్ ప్రారంభానికి ముందే ఏ స్మార్ట్‌ఫోన్‌లపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసా? మీరు శాంసంగ్ కస్టమర్ అయితే మీకోసం బడ్జెట్‌లో అద్భుతమైన ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ M17e 5G భారీ తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
3/7
బడ్జెట్ ఫోన్‌లపై తగ్గింపు : మీరు బడ్జెట్ సెగ్మెంట్లలో కొత్త ఫోన్‌ కొనేందుకు చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ M07 (4GB+64GB) కేవలం రూ. 9,999 ధరకే లభిస్తుంది. 26 శాతం తగ్గింపుతో గెలాక్సీ M07 (4GB+64GB) రూ. 12,499కే లభిస్తుంది. అదనంగా, ఐక్యూ జెడ్10 లైట్ 5జీ బేస్ వేరియంట్ రూ. 13,999కే లభిస్తుంది.
4/7
శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ఆఫర్ : 4 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ఫోన్ అమెజాన్ సేల్‌లో రూ. 12,499కే లభిస్తోంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే యాక్సిస్ లేదా ఎస్‌బీఐ బ్యాంక్ కార్డుతో చెల్లిస్తే మీకు 10శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆ తర్వాత శాంసంగ్ ఫోన్ ధర మరింత తగ్గుతుంది.
5/7
శాంసంగ్ గెలాక్సీ M17e 5G ఫీచర్లు : ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల స్క్రీన్‌పై HD+ రిజల్యూషన్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌ అందిస్తుంది. మందం 8.2 మి.మీ, బరువు 199 గ్రాములు ఉంటుంది. ఫోటోగ్రఫీ పరంగా డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 MP మెయిన్ రియర్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6000mAh బ్యాటరీతో వస్తుంది. అన్ని 12 5జీ బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.0తో వస్తుంది.
6/7
మిడ్ రేంజ్ ఫోన్‌లపై తగ్గింపు : మిడ్ రేంజ్ ఫోన్ల విషయానికి వస్తే.. మోటోరోలా G57 పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై సుమారు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ CE6 (8GB+256GB) 16 శాతం తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
7/7
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ : జూలై 4న ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ సేల్ కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎవరైనా షాపింగ్ చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా అన్ని చౌకైన ధరకే లభించనున్నాయి.