Apple 17 Pro Series : ఆపిల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. కొత్త ఐఫోన్ 18 సిరీస్ ఎంట్రీ.. ఐఫోన్ 17 ప్రో సిరీస్‌ ఔట్..!

Apple 17 Pro Series : ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ ప్రో మోడళ్లు వచ్చేశాయి. అమెరికాలో ప్రారంభ ధరలు భారీగా పెరగగా, ప్రో మాక్స్‌ మోడళ్ల ధరలు భారతీయ మార్కెట్లో అమాంతం పెంచేసింది.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

  • Published on- September 11, 2026 / 12:51 PM IST
1/7
Apple 17 Pro Series : ఆపిల్ లవర్స్‌కు బిగ్ అలర్ట్.. కొత్త ఐఫోన్ 18 ప్రో మోడళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఎప్పటిలాగే ఆపిల్ పాత మోడళ్లకు బైబై చెప్పేసింది. మార్కెట్లోకి కొత్త ఐఫోన్లను దించగానే పాత మోడళ్ల తయారీ ఆపేయడం కామన్.. ఈసారి కూడా ఆపిల్ అదే పనిచేసింది. ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఐఫోన్ 17 ప్రో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లను పూర్తిగా నిలిపివేసింది.
2/7
సాధారణంగా ఆపిల్, నెక్ట్స్ జనరేషన్ ప్రో మోడళ్లను ప్రవేశపెట్టగానే పాత మోడళ్లను నిలివేయడం ఆనవాయితీ. ఇప్పుడు ఈ ఏడాది కూడా ఆపిల్ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ముఖ్యంగా కొత్త ఆపిల్ ప్రో సిరీస్ ధరల్లో భారీ మార్పులు చేసింది. అమెరికా మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో ఐఫోన్ 18 ప్రో మాక్స్ రెండూ గత జనరేషన్ మోడళ్ల కన్నా 100 డాలర్లు (దాదాపు రూ.9,500) అధిక ధరతో అందుబాటులో ఉంటాయి.
3/7
ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ ఔట్ : ఐఫోన్ 17 ప్రో ప్రో మాక్స్ సెప్టెంబర్ 2025లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా అదే నెల చివరలో అమ్మకానికి వచ్చాయి. ఈ రెండు మోడళ్లలో A19 ప్రో చిప్ 48MP సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. 48MP టెలిఫోటో కెమెరా, 4x ఆప్టికల్ జూమ్ 8x వరకు ఆప్టికల్-క్వాలిటీ జూమ్‌ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP సెంటర్ స్టేజ్ కెమెరా కూడా ఉంది.
4/7
ఐఫోన్ 17 ప్రో మోడల్స్ కూడా ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో టైటానియం ఫ్రేమ్ పక్కన పెట్టేసింది. థర్మల్ పర్ఫార్మెన్స్ కోసం ఆపిల్ వేపర్ ఛాంబర్‌తో అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్ 17 ప్రో 6.3-అంగుళాల డిస్‌ప్లే, ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రో సిరీస్, అల్యూమినియం డిజైన్, A19 ప్రో చిప్ అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.
5/7
ఐఫోన్ 18 ప్రో ధర ఎంతంటే? : అమెరికాలో ఐఫోన్ 17 ప్రో 1,099 (సుమారు రూ.1.04 లక్షలు) డాలర్ల ధరకు లాంచ్ కాగా, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర 1,199 డాలర్లు (సుమారు రూ.1.14 లక్షలు) నుంచి ప్రారంభమైంది. కొత్త జనరేషన్ అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ధర 1,199 డాలర్లు (సుమారు రూ.1.14 లక్షలు) నుంచి, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర 1,299 డాలర్లు (సుమారు రూ.1.24 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.
6/7
ఈ రెండు కొత్త ప్రో మోడళ్ల ప్రారంభ ధర గత మోడళ్ల కన్నా 100 డాలర్లు (సుమారు రూ.9,500) ఎక్కువగా ఉంది. భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ.1,49,900 ధరకు లాంచ్ కాగా, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర రూ.1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. 256GB స్టోరేజ్ వేరియంట్‌లో కొత్త ప్రో మ్యాక్స్ కోసం కొనుగోలుదారులు రూ.30వేలు అదనంగా చెల్లిస్తున్నారు.
7/7
ఆపిల్ ప్రీమియం లైనప్‌లో ఇప్పుడు ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ కూడా ఎంట్రీ ఇచ్చాయి. అంతేకాదు.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ ఐఫోన్ డ్యూయో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలచింది. 256GB వేరియంట్ ధర అమెరికాలో 1,999 డాలర్లు (సుమారు రూ.1.9 లక్షలు) నుంచి భారత మార్కెట్లో రూ.2,99,900 నుంచి లభ్యమవుతోంది.