Apple iPhone Air : పండగ చేస్కోండి..! ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గింది.. అమెజాన్‌లో ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..!

Apple iPhone Air : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రూ. 22,910 నేరుగా తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/7
Apple iPhone Air : ఆపిల్ లవర్స్ పండగ చేస్కోండి.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ భారీగా తగ్గిందోచ్.. ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 2 గురించి లీకులు, పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. కొత్త ఐఫోన్ ఎయిర్ 2 రాకపై మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. అందరి దృష్టి ఐఫోన్ ఎయిర్ 2పైనే పడింది. అంతకన్నా ముందుగానే ప్రస్తుత ఐఫోన్ ఎయిర్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్ లవర్స్ ను ఊరిస్తోంది. భారత మార్కెట్లో రూ. 119,900 ధరకు లాంచ్ ఈ ఐఫోన్ ఎయిర్ ప్రస్తుతం రూ. 22వేలకుపైగా డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.
2/7
6.5-అంగుళాల డిస్‌ప్లే, A19 చిప్‌సెట్, 12GB ర్యామ్‌తో ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ అతి త్వరలో ముగుస్తుంది. మీరు ఈ డివైస్‌ను సొంతం చేసుకోవాలంటే వెంటనే కొనేసుకోవడం బెటర్. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డీల్ : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ అనేది ఐఫోన్‌లలోకెల్లా అత్యంత సన్నని ఐఫోన్.. ప్రస్తుతం కేవలం రూ. 96,990కే లభిస్తోంది. ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ. 119,900పై ఏకంగా రూ. 22,910 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కొనుగోలుపై ఎస్‌బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా అసలు ధర నుంచి భారీ తగ్గింపుతో రూ. 92,990కే సొంతం చేసుకోవచ్చు.
4/7
ఆపిల్ నెలకు కేవలం రూ. 3,410 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను అందిస్తోంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ ట్రేడ్-ఇన్ చేసి రూ. 32వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
5/7
ఐఫోన్ ఎయిర్ కొనాలా? వద్దా? : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ A19 చిప్‌సెట్ తో వస్తుంది. అదనంగా 12GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల OLED డిస్‌ప్లే కూడా ఉంది. 3,000 నిట్స్ వరకు డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అందిస్తుంది. పవర్ పరంగా చూస్తే.. ఇందులో 3,100mAh బ్యాటరీ ఉంది. 20W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
6/7
అంతేకాదు.. ఈ ఐఫోన్ మోడల్ 12W మ్యాగ్ సేఫ్ వైర్‌లెస్ ఛార్జర్‌తో కూడా ఛార్జ్ చేయవచ్చు. కెమెరా ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియర్ సైడ్ 48MP ఫ్యూజన్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 18MP కెమెరా కూడా ఉండొచ్చు.
7/7
ఈ ఐఫోన్ ఎయిర్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. చాలా తేలికగా ఈజీగా క్యారీ చేసేలా ఉంటుంది. ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఒకవేళ మరో ఐఫోన్ మోడల్ కోసం చూస్తుంటే ఐఫోన్ 16 ప్రోను తీసుకోవచ్చు. లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో కావాలంటే శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, షావోమీ 14 అల్ట్రా ఫోన్లలో ఏదైనా కొనేసుకోవచ్చు.