Balakrishna Birthday Celebrations : ఘనంగా బాలకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే..?
ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి బాలయ్య బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- June 11, 2026 / 08:08 AM IST
జూన్ 10 నిన్న బాలయ్య పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ పుట్టిన రోజు వేడుకలకు నందమూరి, నారా కుటుంబాలు హాజరయ్యాయి..
ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి బాలయ్య బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది.
ఈ ఫొటోలో బాలకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధర దేవి, కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని, అల్లుళ్ళు లోకేష్, భరత్, కొడుకు మోక్షజ్ఞ, బాలయ్య సోదరులు, సోదరీమణులు ఉన్నారు. దీంతో ఈ నందమూరి ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది.
