Brigida Saga : ప్రియుడ్ని పరిచయం చేసిన పవి టీచర్.. బాయ్ ఫ్రెండ్ తో ‘బ్రిగిడ సాగ’ ఫొటోలు..
అనంత్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా బ్రిగిడ సాగ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
- Saketh U
- Published on- June 30, 2026 / 02:17 PM IST
మొత్తానికి ప్రియుడ్ని పరిచయం చేసిన పవి టీచర్.. బాయ్ ఫ్రెండ్ తో 'బ్రిగిడ సాగ' ఫొటోలు..
ఓ తమిళ టీవీ సీరియల్ లో పవి టీచర్ పాత్రతో ఒక్కసారిగా వైరల్ అయింది బ్రిగిడ సాగ.
ఆ తర్వాత తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. తెలుగులో కూడా సింధూరం, పెదకాపు సినిమాల్లో నటించింది.
ఈ తమిళ భామ ఓ తెలుగు దర్శకుడితో రిలేషన్ లో ఉందంటూ గతంలో రూమర్స్ వచ్చాయి.
తాజాగా తన ప్రియుడు, చిన్నప్పట్నుంచి ఫ్రెండ్ అని నటుడు అనంత్ రామ్ ని పరిచయం చేసింది.
అనంత్ రామ్ తమిళ నటుడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
అనంత్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా బ్రిగిడ సాగ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
