Mustafa Ahmed : చదువు లేదు, హెల్త్ సమస్యలు.. కట్ చేస్తే జిమ్ ట్రైనర్.. ఇప్పుడు దురంధర్ స్టార్.. ఇతని గురించి తెలుసా?

ధురంధర్ పార్ట్ 2లో పాకిస్థాన్ లో ఉండే మరో ఇండియన్ ఏజెంట్ గా, రణవీర్ సింగ్ పక్కనే ఉండే పాత్రలో సినిమా అంతా కనిపించి మెప్పించాడు.

  • Published On : April 2, 2026 / 10:18 AM IST
1/11
ఇటీవల సూపర్ హిట్ అయిన ధురంధర్ సినిమాతో అందులో నటించిన చాలా మందికి స్టార్ డం వచ్చింది. అందులో ఒకరు ముస్తఫా అహ్మద్. ధురంధర్ పార్ట్ 2లో పాకిస్థాన్ లో ఉండే మరో ఇండియన్ ఏజెంట్ గా, రణవీర్ సింగ్ పక్కనే ఉండే పాత్రలో సినిమా అంతా కనిపించి మెప్పించాడు.
2/11
క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ తో కూడా మెప్పిస్తాడు. దీంతో ఈ ముస్తఫా అహ్మద్ ఎవరు అని అంతా వెతికేస్తున్నారు.
3/11
ముస్తఫా అహ్మద్ ఒక జిమ్ ట్రైనర్. చిన్నపుడు డైస్లెక్సియా అనే ఆరోగ్య సమస్యతో బాధపడ్డాడు. అంటే రాయడం, చదవడం కష్టంగా ఉండేది. దాంతో స్కూల్ మధ్యలోనే ఆపేసాడు. ముంబై కి వచ్చి జిమ్ లో పనిచేస్తూ జిమ్ ట్రైనర్ గా మారాడు.
4/11
అనంతరం బాలీవుడ్ కి దగ్గరయ్యాడు. బాలీవుడ్ లో చిన్న చిన్న నటీనటులతో పరిచయాలు పెంచుకొని వాళ్లకు జిమ్ ట్రైనింగ్ ఇచ్చేవాడు ముస్తఫా అహ్మద్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పరిచయం, అతనికి జిమ్ ట్రైనింగ్ ఇవ్వడంతో ఇతనికి ఫేమ్ వచ్చింది.
5/11
ఆ తర్వాత చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కి జిమ్ ట్రైనింగ్ ఇచ్చాడు. దురంధర్ హీరో రణవీర్ సింగ్ కి కూడా ముస్తఫా అహ్మద్ జిమ్ ట్రైనింగ్ ఇచ్చాడు.
6/11
దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఓ సారి రణవీర్ తో కలిసి ఉన్నప్పుడు ఇతన్ని చూసి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. దురంధర్ సినిమాలో తనకు ఇచ్చిన రిజ్వాన్ పాత్రలో ముస్తఫా అహ్మద్ అదరగొట్టి నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.
7/11
ఇతని నటనకు బాలీవుడ్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
8/11
ఒకప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చదువు మానేయాల్సి వచ్చి జిమ్ లో పని చేస్తూ ముంబై లో కష్టాలు పడుతూ జీవనం సాగించిన ముస్తఫా అహ్మద్ ఇప్పుడు స్టార్ జిమ్ ట్రైనర్ గా, బాలీవుడ్ లో నటుడిగా స్థానం సంపాదించుకొని ఫేమ్ తెచ్చుకున్నాడు.
9/11
ఇతనికి పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు.
10/11
11/11
Mustafa Ahmed