Elon Musk House : మస్క్ ఉండే అద్దె ఇల్లు ఇదే.. రెంట్ ఎంతంటే.. రూ.100 లక్షల కోట్లు ఆస్తులున్నా అద్దె ఇంట్లోనే ఎందుకంటే..
Elon Musk House : అపార సంపద ఉన్నప్పటికీ ఎలాన్ మస్క్ జీవనశైలి మాత్రం సంప్రదాయ బిలియనీర్లకు పూర్తి భిన్నంగా ఉంది. స్పేస్‌ఎక్స్ స్టార్‌బేస్ కేంద్రానికి దగ్గరగా ఉన్న సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్రికేటెడ్ చిన్న ఇంటిలోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- June 15, 2026 / 01:15 PM IST
సాధారణంగా సంపన్నుల ఇళ్లు చాలా విలాసవంతంగా, ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. సకల సౌకర్యాలతో ఇంధ్ర భవనాలను తలపిస్తుంటాయి. కానీ, బిలియన్ల డాలర్ల ఆస్తులు కలిగిన ఎలాన్ మస్క్ 375 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన చిన్న ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇంటిలో నివాసం ఉంటున్నాడు.
అమెరికాలోని బోకాచికా సమీపంలో, స్పేస్‌ఎక్స్ స్టార్‌బేస్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ ఇంటి విలువ సుమారు 50వేల డాలర్లు.
బాక్సాబుల్ (Boxabl) సంస్థ తయారు చేసిన ‘కాసిటా’ మోడల్‌కు చెందిన ఈ ఇల్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందించబడింది.
చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్ ఏరియా, బెడ్‌రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి.
మస్క్ గతంలో ఓసారి ఈ ఇంటి గురించి మాట్లాడుతూ అద్భుతమైనదిగా అభివర్ణించారు.
2020లో తనకు చెందిన అనేక విలాసవంతమైన ఇళ్లను మస్క్ విక్రయించారు.
భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవ నివాసాల కలను సాకారం చేయాలంటే సరళ జీవన విధానం అవసరమనే అభిప్రాయాన్ని మస్క్ గతంలో వ్యక్తం చేశారు.
ఈ చిన్న ఇంటి ప్రత్యేకత ఏమిటంటే, ఇది ముందుగానే తయారు చేసి అవసరమైన ప్రదేశానికి తరలించే ప్రీఫ్యాబ్ హౌస్.
తక్కువ ఖర్చుతో నిర్మాణం, తక్కువ స్థలంలో ఎక్కువ సౌకర్యాలు కల్పించడం దీని ప్రధాన లక్షణాలు.
పర్యావరణ హిత జీవన విధానానికి ఒక ఉదాహరణగా మస్క్ నివాసం ఉండే ఇల్లు నిలుస్తుంది.
ప్రపంచ కుబేరుడిగా పేరు పొందిన ఎలాన్ మస్క్ ఇంత సాధారణమైన ఇంటిలో నివాసం ఉంటుండటం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్ ఏరియా, బెడ్‌రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. మర్ఫీ బెడ్, బిల్ట్-ఇన్ స్టోరేజ్, శక్తి పొదుపు డిజైన్ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి.
