Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16, పిక్సెల్ 10, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై బెస్ట్ డీల్స్..

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 వచ్చేస్తోంది. ఐఫోన్ 16, పిక్సెల్ 10, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై ఖతర్నాక్ డీల్స్ పొందవచ్చు.

1/6
Flipkart Big Billion Days Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. పండుగ ఆన్‌లైన్ సేల్ సీజన్ మళ్లీ వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులు 24 గంటల ముందస్తు యాక్సెస్ పొందవచ్చు.
2/6
ఈ సేల్ సమయంలో ఐఫోన్ 16, గూగుల్ పిక్సెల్ 10, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా వంటి భారీ డిస్కౌంట్లతో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఈ ఏడాదిలో మరోసారి ధర తగ్గింపులతో పాటు ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందిస్తోంది.
3/6
ఐఫోన్ 16 : ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 16 (128GB) కేవలం రూ.51,999కే లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. బ్యాంక్ ఆఫర్లు లేదా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు కూడా ఉండవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 16 రూ.74,900కి రిటైల్ అవుతుంది. రూ.23వేలు తగ్గింపుతో ఈ ఐఫోన్ అందుబాటులో ఉంది.
4/6
గూగుల్ పిక్సెల్ 10 : గత నెలలో గూగుల్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 10 ఫోన్ రూ.79,999కి లాంచ్ అయింది. ఈ పిక్సెల్ ఫోన్ సేల్ సమయంలో రూ.67,999కి తగ్గుతుంది. రూ.12వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్ అని చెప్పొచ్చు.
5/6
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (12GB + 256GB) అసలు ధర రూ.1,29,999 నుంచి తగ్గి ప్రస్తుతం రూ.81,985కి అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో మరింత తగ్గింపును పొందవచ్చు.
6/6
అదేవిధంగా, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా (12GB + 256GB) ఫోన్ ధర రూ.1,24,999 నుంచి తగ్గి రూ.76,990కి అందుబాటులో ఉంది. ఈ సేల్ తర్వాత మరింత ధర తగ్గింపు పొందే అవకాశం ఉంది.