Flipkart Freedom Sale 2026 : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఐఫోన్ 17 అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..!
Flipkart Freedom Sale 2026 : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 17 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. పూర్తి ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- August 13, 2026 / 12:52 PM IST
Flipkart Freedom Sale 2026 : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 17కి అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో రూ. 82,900 ధరతో లాంచ్ కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
ఈ ఐఫోన్ ధర ఇంకా తగ్గాలంటే బ్యాంక్ కార్డు ఆఫర్లు ఎంచుకోవచ్చు. ప్రస్తుత ఐఫోన్ 17పై డీల్ ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ కింద లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. మీరు ఈ ఐఫోన్ మోడల్ సొంతం చేసుకోవాలంటే వెంటనే స్పందించండి. పూర్తి డీల్ వివరాలివే..
ఆపిల్ ఐఫోన్ 17 డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 రూ. 82,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 1,000 నేరుగా ధర తగ్గింపుతో రూ. 81,900కు లభిస్తోంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 5,995 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 75,905కు తగ్గుతుంది.
ఈ-కామర్స్ బ్రాండ్ 12 నెలల కాలానికి కేవలం రూ. 6,825 నుంచి నో-కాస్ట్ ఈఎంఐలను కూడా అందిస్తోంది. అప్‌గ్రేడ్ చేసే యూజర్లు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్ మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి రూ. 54,400 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17లో 120Hz రిఫ్రెష్ రేట్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్‌తో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ చేరుకోగలదు. ఈ ఐఫోన్ మోడల్ ఆపిల్ A19 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. 8GB ర్యామ్ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 17లో 48MP ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా, 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP కెమెరా ఉంది. ఐఫోన్ 16తో పోలిస్తే ఈ హ్యాండ్‌సెట్ 6 గంటల వరకు అదనపు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని ఆపిల్ పేర్కొంది.
ఐఫోన్ 17 కొనాలా? వద్దా? :
సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 సిరీస్ రానుంది. అంతకన్నా ముందే ఐఫోన్ 17 తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుత ఐఫోన్ 17 ధర పెరిగే అవకాశం ఉంది. ధర తక్కువ ఉన్నప్పుడే కొనేసుకోవడం బెటర్. ధర ఎంత ఉన్నా పర్వాలేదు.. కొత్త ఐఫోన్ 18 సిరీస్ లేదా ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేవరకు ఆగతామంటే మీదే ఛాయిస్..
