Flipkart GOAT Sale 2026 : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 17 చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Flipkart GOAT Sale 2026 : ఆపిల్ ఐఫోన్ 17 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2026 సేల్ సందర్భంగా మీ బడ్జెట్ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/7
Flipkart GOAT Sale 2026 : ఐఫోన్ లవర్స్ కు భారీ గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. మీరు కొత్త ఐఫోన్ 17 కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ ఉండదు. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2026 సేల్ మొదలువుతోంది.
2/7
ఈ సేల్‌లో ఐఫోన్ 17 కేవలం రూ. 70,900కే సొంతం చేసుకోవచ్చు. ఈ సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఐఫోన్ 17 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 17 సరసమైన ధరకే ఎలా కొనేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
ఐఫోన్ 17 ఆఫర్లు : భారత మార్కెట్లో ఐఫోన్ 17 మోడల్ 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 82,900 ప్రారంభ ధరతో లాంచ్ కాగా ఇప్పుడు 512GB మోడల్ రూ. 1,02,900 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ 'గోట్ సేల్' సందర్భంగా ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 17 సాధారణ ధర కన్నా రూ. 12వేల వరకు డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు.
4/7
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ జూలై 4న ప్రారంభమవుతుంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ రూ. 70,900 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్‌ కొనుగోలుపై డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. HSBC, BOB, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేసే కస్టమర్‌లు ఐఫోన్‌పై 10శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
5/7
ఐఫోన్ 17 కొనుగోలుపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లతో చెల్లింపులపై రూ. 6,995 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 17 తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
6/7
ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 17 పవర్‌ఫుల్ ఆపిల్ A19 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్ ఐఫోన్ 17లో ఏఐ ఇంటర్‌ఫేస్‌ అందిస్తుందని ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ 17లో 2556 x 1179 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. తక్కువ కాంతిలోనూ ఈ డిస్‌ప్లే అద్భుతంగా కనిపిస్తుంది. స్మూత్ స్క్రోలింగ్ కోసం ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
7/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/1.6 అపర్చర్ 26mm ఫోకల్ లెంగ్త్ 48MP ఫ్యూజన్ కెమెరా ఉంది. 52mm ఫోకల్ లెంగ్త్ 12MP 2x టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉంది.