Samsung Galaxy A36 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy A36 5G : మీరు ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తుంటే మీ బడ్జెట్ రూ. 30వేల ధరలో శాంసంగ్ గెలాక్సీ A36 5జీ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- July 7, 2026 / 09:22 PM IST
Samsung Galaxy A36 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 30వేల కన్నా తక్కువ అయితే శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70e 5జీ ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ A36 5జీ డిస్కౌంట్, ఆఫర్లు :
ఈ శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ ఫోన్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్‌లో రూ. 26,999కి లిస్ట్ అయింది. అయితే ఈ ఫోన్ గత ఏడాది మార్చిలో రూ. 32,999కి లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై రూ. 1,825 తగ్గింపు పొందవచ్చు. ఆపై ధర రూ. 25,174 అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారు రూ. 7,825 తక్కువకు లభిస్తుంది. అంతేకాదు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ధర రూ. 23,700 వరకు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, టాప్ బ్రైట్‌నెస్, ఎక్స్చేంజ్ డివైజ్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A36 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ గెలాక్సీ ఎ36 5జీ ఫోన్ 2340x1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ A36 5జీలో యాక్సిలరోమీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 5MP మాక్రో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. కొలతల పరంగా ఈ ఫోన్ 162.9 మిమీ పొడవు, 78.2 మిమీ వెడల్పు, 7.4 మిమీ మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది.
