Gold Price Today : ఆహా.. మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Price Today : ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

1/7
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఇవాళ మాత్రం భారీగా తగ్గింది. వెండి ధరసైతం భారీగా తగ్గింది.
2/7
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రామాలు 24 క్యారట్ల బంగారంపై రూ. 1,090 తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. వెయ్యి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 34డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 5,144 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
3/7
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి రేటు కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,220కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,48,700 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,62,370 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,850 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,62,220కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,700 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,63,310 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,49,700 వద్దకు చేరింది.
6/7
వెండి ధరలో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,80,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.