Gold Price Today : భారీగా పడిపోయిన బంగారం ధర.. రాత్రికిరాత్రే ఢమాల్.. తులం గోల్డ్‌పై ఎంత తగ్గిందంటే? ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ..
Gold Price Today : ఉగాధి పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. వరుసగా ఐదోరోజు బంగారం ధర తగ్గింది.
- Harishth Thanniru
- Published On : March 16, 2026 / 11:09 AM IST
ఉగాధి పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. ఎందుకంటే గత ఐదు రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది.
పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ మేఘాలు బులియన్ మార్కెట్ మీద అంతగా ప్రభావం చూపకపోవడంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇన్వెస్టర్లు సైతం బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే, ఈ వారం రోజుల వరకు బంగారం ధరలు తగ్గుతూనే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 490 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 360 తగ్గింది. అయితే, గడిచిన ఐదు రోజుల్లో 10గ్రాముల బంగారంపై రూ.4వేలకు పైగా తగ్గింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గుతోంది. తాజాగా.. ఔన్సు గోల్డ్ 12 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ రేటు 5,008 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరసైతం తగ్గింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.వంద తగ్గింది. అయితే, ఐదు రోజులుగా కిలో వెండిపై రూ.20వేలకుపైగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,59,170కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,45,900 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,300 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,050 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,170కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,45,900 వద్దకు చేరింది.
వెండి ధరలో ఇవాళ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,79,900 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,70,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,79,900 వద్దకు పడిపోయింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
