Gold Price Today : అయ్యో.. ఉగాది వేళ గోల్డ్ ప్రియులకు బిగ్‌షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today : గత ఐదు రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం భారీగా పెరిగింది. వెండి ధరసైతం భారీగా పెరిగింది.

1/8
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్‌షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి.
2/8
గత ఐదు రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం భారీగా పెరిగింది. వెండి ధరసైతం భారీగా పెరిగింది.
3/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,200 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1,100 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 32 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 5,037 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధరసైతం భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.4వేలు పెరిగింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,58,620కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,45,400 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,58,770 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,550 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,820కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,46,500 వద్దకు చేరింది.
7/8
వెండి ధర ఇవాళ భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్దకు చేరింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.