అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్రత మరింత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
2/8
బంగారం ధర భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 10గ్రాములు బంగారం ధర మూడు రోజుల్లో రూ.10వేలకు పైగా పెరిగింది. వెండి ధరసైతం భారీగా పెరుగుతోంది.
3/8
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.4370 పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.4వేలు పెరుగుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్స్ గోల్డ్ పై 122 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 5,043 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
ఆదివారం వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది. దీంతో శని, ఆదివారాల్లో కిలో వెండిపై రూ.30వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,73,080కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,58,650 వద్దకు చేరింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,73,230 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,58,800 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,73,080కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,58,650 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,73,080 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,58,650 వద్దకు చేరింది.
7/8
వెండి ధరలో ఇవాళ భారీ పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,25,000కు చేరుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు కొనసాగుతుంది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.