Gold Rate Today : భారీగా పతనమైన బంగారం ధర.. మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా? కారణాలివే.. నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఇలా..

Gold Rate Today : బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, గోల్డ్ రేటు మళ్లీ రూ.లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

1/9
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ రేటు భారీగా పతనమవుతున్నాయి. ఊహించని స్థాయిలో రోజురోజుకు గోల్డ్ రేటు పడిపోతోంది.
2/9
గడిన ఐదు రోజుల్లో తులం బంగారం రేటు రూ.12వేలకుపైగా తగ్గింది. వెండి ధరసైతం భారీగా తగ్గుతోంది. గడిన ఐదు రోజుల్లో కిలో వెండిపై రూ.21వేలు తగ్గింది. దీంతో వారంలో పడిసి ధర 10శాతం, వెండి ధర 15శాతం తగ్గుదల చోటు చేసుకుంది.
3/9
మార్చి నెలాఖరు వరకు గోల్డ్, సిల్వర్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనూ పరిస్థితులు ఇలానే ఉంటే తులం బంగారం రేటు రూ.లక్షకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
4/9
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించొచ్చుననే అంచనాలకు తోడు డాలర్ బలోపేతం కావడం వల్ల పసిడి, వెండి ఫ్యూచర్స్ కు అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. చమురు ధరలు గణనీయంగా పెరగడం వల్ల కూడా, అంతర్జాతీయంగా ముదుపర్ల సెంటిమెంట్ పై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి.
5/9
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు బంగారంపై 161 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,488 డాలర్ల వద్దకు పడిపోయింది. మార్చి నెలాఖరు నాటికి ఔన్సు గోల్డ్ రేటు 4వేల డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
6/9
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,45,970కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,33,800 వద్ద కొనసాగుతోంది.
7/9
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,120 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,33,950 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,45,970కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,33,800 వద్దకు చేరింది.
8/9
వెండి ధర ఇవాళ తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,45,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతుంది.
9/9
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.