Telugu » Photo-gallery » Gold And Silver Price In Hyderabad Visakhapatnam Delhi Today 24 February 2026 Full Details Hn
Gold Rate Today : షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. మళ్లీ పెరుగుదలకు కారణాలు ఇవే.. నేటి రేట్లు వివరాలు ఇలా..
Gold Rate Today : పసిడి ప్రియులకు బంగారం ధరలు భారీ షాకిస్తున్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
పసిడి ప్రియులకు బంగారం ధరలు భారీ షాకిస్తున్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్‌హై నుంచి భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ తమ దూకుడును కొనసాగిస్తున్నాయి.
2/8
భారతదేశంలో ప్రస్తుతం పెండ్లిళ్ల జోరు కొనసాగుతోంది. శుభముహూర్తాలు ఉండటంతో పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ రేటు భారీగా పెరగడంతో బంగారం కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా మారింది.
3/8
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులే బంగారం ధర పెరుగుదలకు కారణమని చెప్పారు. ఫిబ్రవరి 23న ఆర్బీఐ సెంట్రల్ బోర్డును ఉద్దేశించి ప్రసంగించిన తరువాత నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారంలో ఎక్కువ భాగం కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరల పెరుగుదలకు కారణం అవుతోందని చెప్పారు. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉధ్రిక్తతలు, సుంకాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి.
4/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 103 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 5209 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
5/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,360కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,47,910 వద్దకు చేరింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధానిలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,510 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,060 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,360కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,47,910 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,62,120 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,610 వద్దకు చేరింది.
7/8
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,00,100కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,00,100 వద్దకు చేరింది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.