Telugu » Photo-gallery » Gold And Silver Price In Hyderabad Visakhapatnam Delhi Today 25 February 2026 Full Details Hn
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే..
Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ షాక్.. ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి.. బంగారం ధర స్వల్పంగా పెరగ్గా.. వెండి రేటు భారీగా పెరిగింది.
బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ షాక్.. భారతదేశంలో వీటి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్‌హై నుంచి భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ తమ దూకుడును కొనసాగిస్తున్నాయి.
2/8
భారతదేశంలో ప్రస్తుతం పెండ్లిళ్ల జోరు కొనసాగుతోంది. శుభముహూర్తాలు ఉండటంతో పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ రేటు భారీగా పెరగడంతో బంగారం కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా మారింది.
3/8
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం స్వల్పంగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. రూ. 110 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 23 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 5,183 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం భారీగా తగ్గిన వెండి ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది. కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,890కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,400 వద్దకు చేరింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,62,040 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,550 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,890కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,400 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,62,800 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,49,300 వద్దకు చేరింది.
7/8
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,95,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు చేరింది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.