×
Ad

Gold Rate Today : బంగారం కొంటున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్.. తులం గోల్డ్ రేటు ఎంతంటే..? పూర్తి వివరాలు ఇలా..

Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

1/8
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది. గురువారం తగ్గిన బంగారం ధర.. ఇవాళ భారీగా పెరిగింది. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
2/8
భారతదేశంలో ప్రస్తుతం పెండ్లిళ్ల జోరు కొనసాగుతోంది. శుభముహూర్తాలు ఉండటంతో పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అయితే, వారంరోజుల క్రితం వరకు గోల్డ్ రేటు పెరగడంతో పసిడి ప్రియులు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే, గత నాలుగు రోజులుగా బంగారం ధర తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినట్లయింది. అయితే, ఇవాళ మళ్లీ బంగారం ధర పెరిగింది.
3/8
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 500 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై ఐదు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు బంగారం 5,183 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం కిలో వెండిపై రూ.5వేలు పెరగ్గా.. గురువారం, శుక్రవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.. స్థిరంగా కొనసాగుతోంది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,570కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,100 వద్దకు చేరింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,720 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,250 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,570కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,100 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,62,550 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,49,000 వద్దకు చేరింది.
7/8
వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు కొనసాగుతుంది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.