Gold Price Today : రూ.15వేలు తగ్గింది.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

Gold Price Today : బంగారం, వెండి ధరల్లో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం రేటు పెరగ్గా.. వెండి రేటు భారీగా తగ్గింది.

1/8
దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం గోల్డ్ రేటు భారీగా పెరగ్గా.. గురువారం తగ్గింది.. ఇవాళ మళ్లీ గోల్డ్ రేటు పెరిగింది. వెండి ధర మాత్రం ఇవాళ భారీగా తగ్గింది.
2/8
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు మార్కెట్లు ప్రభావితం కావడంతోపాటు, ఇది అమెరికా డాలర్‌ను మరింత బలోపేతం చేసింది. దీంతో అటు అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది.
3/8
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 160 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 65 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,445 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధరలో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండిపై ఏకంగా రూ. 15వేలు తగ్గింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,710కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,650 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,860 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,800 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,44,710కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,32,650 వద్ద కొనసాగుతుంది.
7/8
వెండి ధరలో ఇవ్వాళ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కిలో వెండిపై రూ.15వేలు పెరిగింది. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,50,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్దకు పడిపోయింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.