బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు భారీ షాకింగ్ న్యూస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఊహించని స్థాయిలో వీటి ధరలు పెరిగాయి. రాత్రికిరాత్రే వేలల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు జంప్ అయ్యాయి.
2/8
భారతదేశంలో ప్రస్తుతం పెండ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. శుభముహూర్తాలు ఉండటంతో పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మహిళలు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అయితే, వారంరోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ప్రస్తుతం భారీగా పెరుగుతోంది. గోల్డ్, సిల్వర్ రేట్లు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి.
3/8
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,900 పెరగ్గా.. 24 క్యారట్ల బంగారంపై రూ. 3,160 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 122 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 5,043 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలోనూ భారీ మార్పుచోటు చేసుకుంది. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్ ధర.. ఇవాళ భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.5వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,730కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,51,000 వద్దకు చేరింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,64,880 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,51,150 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,64,730కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,51,000 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,65,820 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,52,000 వద్దకు చేరింది.
7/8
వెండి ధరలో ఇవాళ భారీ పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,00,000కు చేరుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,00,000 వద్దకు కొనసాగుతుంది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.