Telugu » Photo-gallery » Gold And Silver Price In Hyderabad Visakhapatnam Delhi Today 3rd March 2026 Full Details Hn
Gold Price Today : యుద్ధంవేళ బంగారం ప్రియులకు భారీ ఊరట.. వరుసగా రెండోరోజు తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?
Gold Price Today : మంగళవారం బంగారం ధర తగ్గింది. సోమవారం భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఇవాళ స్వల్పంగా తగ్గుదల చోటు చేసుకుంది. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తుండగా.. ఇరాన్ ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఈ దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతోంది.. వారంరోజులపాటు ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది. అయితే, ఈ వార్ కారణంగా మార్కెట్లుసైతం కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ఈ వార్ ఎఫెక్ట్‌తో పసిడి ధర పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ, ఊహించని విధంగా గోల్డ్ రేటు పడిపోతోంది.
2/8
సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గగా.. మంగళవారం సైతం గోల్డ్ రేటు తగ్గింది. అయితే, ఈ తగ్గుదల ఇలానే కొనసాగుతుందా.. లేదంటే.. పశ్చిమాసియాలో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరుగుతాయా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 490 తగ్గగా.. 22క్యారెట్ల బంగారంపై రూ.450 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు దూసుకెళ్తోంది. ఔన్సు గోల్డ్‌పై 35డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 5,358 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. సోమవారం కిలో వెండిపై రూ.10వేలు తగ్గింది. అయితే, మంగళవారం సిల్వర్ రేటులో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,020కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,55,850 వద్దకు చేరింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,70,170 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,56,000 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,70,020కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,55,850 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,70,730 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,56,500 వద్దకు చేరింది.
7/8
వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,15,000కు చేరుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో మాత్రం కిలో వెండిపై రూ.20వేలు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఆయా నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,95,000వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.3,15,000 వద్దకు కొనసాగుతుంది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.