బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే మీకు పండుగలాంటి వార్త. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. గత మూడు రోజులుగా గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
2/9
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తుండగా.. ఇరాన్ ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఈ దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతోంది.. ఈ వార్ కారణంగా మార్కెట్లుసైతం కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ఈ వార్ ఎఫెక్ట్‌తో పసిడి ధర పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ, ఊహించని విధంగా గోల్డ్ రేటు పడిపోతోంది.
3/9
యుద్ధం పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని పెట్టుబడిదారులు ఆశిస్తారు. ఈసారి కూడా తొలుత పెరిగినా.. సోమవారం నుంచి ధరలు దిగివస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు ఉన్నాయి. డాలర్‌కు గిరాకీ పెరిగి, కొన్ని కరెన్సీలతో పోలిస్తే దీని విలువ నెల గరిష్టానికి చేరింది. ఇందువల్ల డాలర్ రూపేణ బంగారం, వెండి కొనుగోలు చేయడం విదేశీయులకు భారమైంది. యుద్ధం వల్ల పెట్రో ధరల పెరుగుదలతో, ద్రవ్యోల్బణం అధికం కానుంది. ఇందువల్ల వడ్డీరేట్ల తగ్గింపునకు అమెరికా అవకాశాలు సన్నగిల్లాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే విలువైన లోహాల్లోకి పెట్టుబడులు తగ్గాయి. దీంతో ధరలు దిగొస్తున్నాయి.
4/9
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.3,100 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 2,850 తగ్గింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 77డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సుగోల్డ్ 5,165 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
5/9
వెండి ధర కూడా భారీగా తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 20వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
6/9
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,510కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,50,800 వద్దకు చేరింది.
7/9
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,64,660 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,950 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,64,510కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,50,800 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,65,820 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,50,000 వద్దకు చేరింది.
8/9
వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.20వేలు తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,95,000 వద్దకు చేరుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో మాత్రం కిలో వెండిపై రూ.10వేలు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఆయా నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,85,000వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్ద కొనసాగుతుంది.
9/9
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.