Gold Price Today : కొనసాగుతున్న వార్.. సడెన్‌గా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఈరోజు రేట్లు ఇవే..
Gold Price Today : ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటేచేసుకోలేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
- Harishth Thanniru
- Published On : March 8, 2026 / 11:18 AM IST
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సైతం ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లపై యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలపైనా యుద్ధం ప్రభావం చూపింది.
ఇరాన్, ఇజ్రాయెల్ వార్ మొదలైన రోజునుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో గడిచిన ఐదు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.11వేలు తగ్గింది. శనివారం గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. తాజాగా బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.. స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 75డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 5,158 వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,640కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,50,000 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,63,800 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,150 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,63,640కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,50,000 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,64,180 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,50,500 వద్దకు చేరింది.
వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,85,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
