బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గత రెండు రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటు ఇవాళ తగ్గింది.. మరోవైపు వెండి ధరసైతం తగ్గుదల చోటు చేసుకుంది.
2/6
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
3/6
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,45,300 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,58,510కు చేరింది.
4/6
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,45,450కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,58,660కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,45,300కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,58,660కు వద్దకు చేరింది.
5/6
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,00,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,00,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,00,000 వద్దకు చేరింది.
6/6
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.