బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ శుభవార్త. గత కొద్దిరోజుల క్రితం వరకు పెరిగిన ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి.
2/7
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.2,620 తగ్గగా.. 22 క్యారట్ల బంగారం రూ.2,400 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 39డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,966డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
వెండి ధరసైతం భారీగా తగ్గింది. గత మూడు రోజులుగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా.. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.20వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,42,800 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,55,780కు చేరింది.
5/7
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,42,950కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,55,930కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,42,800కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,55,780కు వద్దకు చేరింది.
6/7
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,80,000 వద్దకు చేరింది.
7/7
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.