Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారా.. అయితే, విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్.
- Harishth Thanniru
- Published On : February 14, 2026 / 11:20 AM IST
భారత దేశంలో గోల్డ్ కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. మన ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా.. పండుగుల సమయాల్లో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పెండ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, గోల్డ్ రేటుసైతం మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
గత కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మూడు రోజుల నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అయితే, శనివారం మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా గోల్డ్, సిల్వర్ రేటు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,800 పెరిగింది. 22 క్యారట్ల బంగారంపై రూ.1470 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 114 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 5,041 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం నుంచి స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి.. శుక్రవారం భారీగా (రూ.20వేలు) పెరిగింది. అయితే, ఇవాళ (శనివారం) వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,44,600 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,57,750కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,44,750కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,57,900కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,44,600కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,57,750కు వద్దకు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,80,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
