Gold Rate Today : బంగారం కొనేవారికి భారీ గుడ్‌న్యూస్.. అమెరికా దెబ్బతో ధర ఢమాల్.. తులం రేటు ఎంతంటే?
Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
- Harishth Thanniru
- Published On : February 18, 2026 / 07:03 AM IST
భారత దేశంలో శుభకార్యాల సీజన్ షురూకానుంది.. ఈనెల 19నుంచి శుభముహూర్తాలు ఉండటంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే రెండు నెలలు శుభముహూర్తాలు ఉండటం, పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనుండటంతో బంగారంకు భారీగా డిమాండ్ పెరగనుంది.
గత నెల రోజులతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త శాంతించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తాజా పరిణామాలు కూడా పసిడి మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయడం మార్కెట్‌లో పెట్టుబడిదారుల భావోద్వేగాలను ప్రభావితం చేసింది. ఈ నిర్ణయం తరువాత బంగారం ధరల్లో ఒడిదుడుకులు కనిపించాయి.
గత వారం రోజుల క్రితం వరకు భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతుంది. సోమ, మంగళవారాల్లో తులం బంగారంపై సుమారు రూ.3,500 తగ్గింది. బుధవారం కూడా గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల బంగారంపై భారీ తగ్గుదల కనిపించింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం రేటు తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ఔన్సు గోల్డ్‌పై 110 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4884 డాలర్లకు చేరింది.
వెండి ధరసైతం తగ్గుతోంది. గడిచిన రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.15వేలు తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే.. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,54,190కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,41,340 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,41,490కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,54,340కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,41,340కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,54,190 వద్దకు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,64,900కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,67,900 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,64,900 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
