ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి.
2/8
జనవరి 30న 24 క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 8,850 తగ్గింది.. 31వ తేదీన రూ.790 తగ్గింది. అయితే, ఇవాళ (ఫిబ్రవరి1) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకోవటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3/8
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బడ్జెట్ తరువాత బంగారం, వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
4/8
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేటు భారీగా తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 434 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 4,893 డాలర్ల వద్దకు చేరింది. వెండి రేటుసైతం తగ్గుముఖం పట్టింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,47,200 వద్ద కొనసాగుతుండగా.. 24క్యారట్ల ధర రూ.1,60,580 వద్ద కొనసాగుతుంది.
6/8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,47,350కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,60,730కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,47,200కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,60,580కు వద్దకు చేరాయి.
7/8
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,20,000కు పడిపోయింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,50,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,20,000 వద్దకు చేరింది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.