×
Ad

Gold Rate Today : బంగారం, వెండి ధరలు యూటర్న్.. ఇన్వెస్టర్లకు బిగ్ షాక్.. నేటి ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ఎంతంటే?

Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి

1/8
బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. భారతీయ బులియన్ మార్కెట్లో సరికొత్త గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
2/8
భారత దేశంలో పెండ్లిళ్ల సీజన్ కావడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాలు పెరగడంతో పసిడి ధరలతో పాటు వెండి సామాన్యులకు భారంగా మారుతోంది.
3/8
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పసిడి ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 130 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 5,106 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది.
4/8
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మరి కొంచెం పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు పెరిగే కొద్దీ గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
5/8
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర పెరిగింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,57,904కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,44,260 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,44,410కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,57,530కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,44,410కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,57,904 వద్దకు చేరింది.
7/8
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,69,900కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,69,900 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,69,900 వద్ద కొనసాగుతుంది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.